• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Telangana Samskruthi Kalalu

Telangana Samskruthi Kalalu By Juluru Gowrishankar

₹ 350

మాతృభాష కోసం మహోద్యమం!
 

- డా॥ పేర్వారం జగన్నాథం

అవిభక్త హైదరాబాదు రాష్ట్రం అంటే నిజాం రాష్ట్రంలో తెలుగు భాషా చైతన్యం ఎట్లా వికాసం పొందుతూ వచ్చిందో తెలుసుకోవడం ఈ వ్యాసం ప్రధాన ఉద్దేశం. భాష పరస్పరం ఒకరి భావాలు మరొకరికి తెలుపడం కోసం సమాజం ఏర్పరచుకున్న ఒక వ్యవస్థ. ప్రతి జాతికీ తమ ప్రాకృతిక, సామాజిక, సాంస్కృతిక నేపథ్యం నుంచి ఒక ప్రత్యేకమైన భాష ఏర్పడుతుంది. అది వాళ్ళ మాతృభాష అవుతుంది. అది వాళ్ళ సాంస్కృతిక చిహ్నమవుతుంది. భాష ఒక జాతి ఉనికిని కాపాడే ఊపిరివంటిది. అది లేకపోతే సంస్కృతి లేదు. జాతి లేదు. భాషకింతటి ప్రాముఖ్యముంటుంది కనుకనే దాన్ని కాపాడుకోవడానికి జాతులు పోరాడుతాయి.

గోలకొండను పరిపాలించిన కుతుబ్షాహీలు ఫారసీని అధికారభాషగా ప్రవేశపెట్టగా, వాళ్ళ తరువాత హైదరాబాదును పరిపాలించిన అసష్టాహీలు ఉర్దూను అధికారభాషగా ప్రవేశపెట్టినారు. అందువల్ల తెలంగాణాలో ప్రజల మాతృభాష అయిన తెలుగు నిరాదరణకు గురైంది. ఒక విధంగా అణచివేతకు గురైందని చెప్పవచ్చు. విద్యాబోధన, పరిపాలన, జనవ్యవహారమంతా ఉర్దూలోనే సాగుతుండేది. న్యాయస్థానాల్లోనూ వాదోపవాదాలూ తీర్పులూ అన్నీ కూడా ఉర్దూలోనే వుండేవి. ఈ కారణంగా ప్రజలకూ ప్రభుత్వానికీ మధ్య భాష వారధిగా వుండవలసింది పోయి, పెద్ద అగాధమేర్పడింది. ప్రజల మనోభావాలు ప్రభుత్వానికి తెలిసే అవకాశం లేకుండా.................

  • Title :Telangana Samskruthi Kalalu
  • Author :Juluru Gowrishankar
  • Publisher :Adugu Jadalu Publications
  • ISBN :MANIMN5921
  • Binding :Papar Back
  • Published Date :June, 2019 2nd print
  • Number Of Pages :360
  • Language :Telugu
  • Availability :instock