• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Telangana Toli Taram Kadhakulu Kadhana Reetulu

Telangana Toli Taram Kadhakulu Kadhana Reetulu By K P Ashok Kumar

₹ 280

అత్యవసరమీ తెలంగాణ కథ చరిత్ర!
 

ఎన్. వేణుగోపాల్

చిరకాల మిత్రులు కె.పి. అశోక్ కుమార్ సాహిత్య విమర్శ రంగంలో ఎంతోకాలంగా కృషి చేస్తూ సుప్రసిద్ధులయ్యారు. నిజానికి ఆయనను ఇప్పుడెవరూ కొత్తగా పరిచయం చేయనక్కరలేదు. ఎవరూ కొత్త కితాబులు ఇవ్వనక్కరలేదు. అయినా ఆయన నా పట్ల స్నేహభావంతో, తన కొత్త పుస్తకం 'తొలితరం తెలంగాణ కథకులు - కథన రీతులు' కు నాలుగు మాటలు రాయమని అడిగారు. ఆయన వంటి అపారమైన కృషి చేసిన విమర్శకులు నన్ను అడగడం ఒక గౌరవంగా భావిస్తూ, కేవలం పాఠకుడిగా, తెలంగాణ సమాజ సాహిత్యాల విద్యార్థిగా మాత్రమే ఈ చిన్న పరిచయం.

తెలంగాణ మాగాణంలో ఇరవయ్యో శతాబ్ది తొలి అర్ధభాగం సామాజిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలలో అత్యంత ఫలవంతమైన కాలం. ఆ కాలంలో దాదాపు నాలుగు దశాబ్దాలలో వికసించిన ముప్పై మంది కథా రచయితలను పరిచయం చేసిన వ్యాసాలివి. ప్రత్యేకంగా అశోక్ కుమార్ 1912-56 అనే కాలవ్యవధి తీసుకున్నారు. 'తెలంగాణ కథకులు', '1912-56 కాలం', 'వారినీ వారి కథన రీతులనూ పరిచయం చేయడం' అనే మూడు అంశాలూ చాలా లోతుగా ఆలోచించవలసినవి. గతానికి సంబంధించినవి మాత్రమే కాదు, వర్తమానానికీ, బహుశా భవిష్యత్తుకూ కూడా సంబంధించినవి. కథా ప్రక్రియకు పరిమితమైనవి మాత్రమే కాదు, సమాజ సాహిత్య సంబంధాలకు విస్తరించినవి................

  • Title :Telangana Toli Taram Kadhakulu Kadhana Reetulu
  • Author :K P Ashok Kumar
  • Publisher :Nava Chetan Publishing House
  • ISBN :MANIMN5702
  • Binding :Papar Back
  • Published Date :Sep, 2024
  • Number Of Pages :280
  • Language :Telugu
  • Availability :instock