తెలివైనవాడు
కపిలపురంలో ఉండే సుక్షేణుడు వ్యాపారి. అతడికి చాలా ఊళ్ళల్లో వ్యాపారాలు ఉన్నాయనీ, పలుకుబడి గల వ్యక్తి అనీ, అతడికి రాజుగారి కొలువులో మిత్రులున్నారనీ అనుకునే వారు. అతడిని కలిసి ప్రయత్నిస్తే ఎంత కష్టమైన పని అయినా తొందరగా పూర్తి చేయిస్తాడని అనుకునేవారు.
ఈ వార్త ఆ నోటా ఈ నోటా పాకి పావనపురంలో ఉండే దీర్ఘతముడుకి తెలిసింది. అతడు విద్య పూర్తి చేసి రాజుగారి కొలువులో నౌకరీ చెయ్యాలనే కోరిక ఉన్నవాడు. ఇది వినగానే సంబరపడిపోయాడు. ఎలాగైనా సుక్షేణుడుని కలుసుకుని తనకి సాయం చెయ్యమని అడగాలని బయల్దేరాడు.
మార్గమధ్యంలో దట్టమైన అడవిని దాటుకుని కపిలపురం వెళ్ళాడు. దీర్ఘతముడు వెళ్ళిన సమయానికి సుక్షేణుడు రాజధానికి వెళ్ళాడు. తిరిగి రావడానికి వారం రోజులు పడుతుందని చెప్పింది అతడి భార్య. తన భర్త తిరిగి వచ్చే వరకు ప్రక్కనే ఖాళీగా ఉన్న తమ ఇంట్లో ఉండమని చెప్పి వేళకి ఇంత తిండి పెడతామని చెప్పింది.
ఆమెతో దీర్ఘతముడు “అలాగే ఉంటాను. నేను చాలా అవసరంలో ఉన్నాను. నాకు ఎలాగైనా రాజకొలువులో నౌకరీ దొరికేలా చెయ్యమని సుక్షేణుడు రాగానే చెప్పండి. అంతవరకూ తిని కూర్చోకుండా నాకు ఏదైనా పని చెబితే మీకు సాయపడతాను" అన్నాడు. ఆమె అలాగే అని మాట ఇచ్చి కొడుకులకు పరిచయం చేసింది................