తొలి నిరసన స్వరం
ఈ నవల రాసేందుకు నా మొదటి ప్రేరణ తిరువారూర్ విరుదాచల కల్యాణసుందరం (తిరు.వి.క) గారి స్వీయ చరిత్ర. ఆ పుస్తకంలో మన దేశంలో జరిగిన మొట్టమొదటి కార్మికుల సమ్మె - బిన్నీ కార్మికుల సమ్మె గురించి ఆయన రాశారు.
కార్మికోద్యమాలు ఇరవైయవ శతాబ్దపు మొదటి రోజుల్లో ప్రపంచమంతటా వ్యాపించాయి. 1890లో దేశంలో మొదటి కార్మిక సంఘం 'బొంబాయి మిల్ హ్యాండ్స్ అసోసియేషన్' (Bombay Millhands Association) ఏర్పడింది. 1905లో కలకత్తాలో ప్రింటర్స్ యూనియన్, 1907లో బాంబే తపాలా ఉద్యోగుల సంఘం ఏర్పడ్డాయి. ఆ తర్వాత దేశమంతా అనేక చోట్ల కార్మిక సంఘాలు ఏర్పాటై, వాటి ఫలితంగా 1920లో 'అఖిల భారత కార్మిక సంఘం సమాఖ్య' (All India Trade Union Congress) ఆవిర్భవించింది. కార్మిక ఉద్యమాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది......................