• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Telugu Chalanachitra Vikasam 1940- 1990

Telugu Chalanachitra Vikasam 1940- 1990 By Dr Desiraju Lakshmi Narasimharao

₹ 300

పీఠిక

ఆధునిక ఆర్థిక, సామాజిక పరిణామాలకు సమకాలీన భారతీయ సమాజాన్ని ప్రతిబింబించడానికి 'చలనచిత్రరంగం' ఎంతగానో తోడ్పడి తనవంతు పాత్ర సమర్థవంతంగా నిర్వహించింది. ఏదో ఒక విధంగా భారతదేశ జనాభాలో 75% చలనచిత్రం వైపు మొగ్గు చూపిందని ప్రముఖ సర్వేలు, నివేదికలు వివరించాయి, విశ్లేషించాయి. నేడు తెలుగు చలనచిత్ర పరిశ్రమను యావద్భారతదేశ చలనచిత్ర నిర్మాణంలో అద్వితీయ స్థానం ఆక్రమించిందంటే అతిశయోక్తి కాదు.

నా తరం వారిలో చాలామందిలాగా నేను కూడా 'చలనచిత్రం' అంటే ఎక్కువ మక్కువ చూపాను. అది నా చిన్నతనం నుండి. మా నాన్నగారు అప్పట్లోనే వివిధ భాషల్లో వచ్చిన చలనచిత్రాలు చూసేవారు. ఆయనతో పాటు కొన్ని నేను చూశాను. మా నాన్నగారు ఆయా చలనచిత్ర సంబంధిత ఛాయాచిత్రాలు, కరపత్రాలు, పాటల పుస్తకాలు వగైరా అప్పట్లో సేకరించి 'ఆల్బమ్' తయారు చేసేవారు. ఇతర చలనచిత్ర సంబంధిత సాహిత్యం పుస్తకాల రూపేణా ఆయన వద్ద ఉండేవి. మా మాతామహులు పౌరాణిక చిత్రాలకు పోతూ నన్నూ తనతో తీసుకుపోయేవారు. ఎక్కడికి పనిమీద పోయి వస్తున్నా నా దృష్టి గోడలపై ఉన్న చతనచిత్ర పోస్టర్లపై పడేది. ఆయా చలనచిత్రాలను చూసొచ్చిన మా కుటుంబ సభ్యులు నా చిన్నతనాన వాటిల్లోని నటీనటుల నటనా వైదుష్యం, హావభావ వ్యక్తీకరణ, పాత్రల చిత్రీకరణ, కథాకథనం, పాటలు, పోరాట సన్నివేశాలు గూర్చి మా ముందు చెప్పుకుంటుంటే చలనచిత్రాలపై ఉండే విపరీత ఆకర్షణ, శ్రద్ధాసక్తులు, ఏకాగ్రత, ఇష్టాఇష్టాలు నాలోనూ, నాకునూ.................

  • Title :Telugu Chalanachitra Vikasam 1940- 1990
  • Author :Dr Desiraju Lakshmi Narasimharao
  • Publisher :Emasco Books pvt.L.td.
  • ISBN :MANIMN5583
  • Binding :Papar back
  • Published Date :Aug, 2024
  • Number Of Pages :399
  • Language :Telugu
  • Availability :instock