• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Telugu Dheera

Telugu Dheera By Gv Purnachandu

₹ 150

తెలుగు వారి చైతన్యపరిచే
 

అద్భుత నవల తెలుగుధీర

యజ్ఞ ప్రసాద్

డా॥ జి.వి. పూర్ణచందు గారు తెలుగు వాళ్ళకి ఏది చెప్పినా సశాస్త్రీయంగా నిరూపించి ఇది మన సంస్కృతి, ఇది మన సంప్రదాయం అని ఢంకా బజాయించి చెప్పే రచనలే గానీ ఊసుబోని మాటలు, కాలక్షేపపు కబుర్లు వీరు చేయలేదు. కూలంకషంగా చర్చించేవే. అవగాహన చేసుకునేవే ..... అన్నీ!

ఇంతకాలం ఇవి చదవకపోవటం వలన ఏర్పడిన “మనదంటూ ఏమీ లేదు అన్నీ పరాయి సంస్కృతులే” అనే భావన నుండి పాఠకులు బయటపడతారు. అంతటి జిజ్ఞాసని కలిగిస్తాయి వీరి రచనలు.

నిరంతర పరిశోధన... భాషా మూలాలను వెలికి తీయాలనే తపన... తెలుగు భాషని సమున్నత స్థానంపై కూర్చోబెట్టాలనే అవిరళ కృషి... ఈ భాగంలో నిరంతర పోరాటాలూ, ఉద్యమాలూ, ఉపన్యాసాలలో పాల్గొని తెలుగువారిని చైతన్య పరుస్తున్న రచయిత, పరిశోధకుడు, వైద్యుడు, తెలుగువారి ఆహార చరిత్రవేత్త, శతాధిక గ్రంథకర్త డా॥ జి.వి. పూర్ణచందు గారితో ముఖాముఖి ఇది. వారితో చిత్ర మాస పత్రిక కోసం నేను జరిపిన సంభాషణని ఇక్కడ ప్రచురించడం సముచితంగా భావిస్తున్నాను.

ప్ర॥ తెలుగు భాషోద్యమం వైపు అడుగులు వేయాలనే తపన ఎలా కలిగింది? స్ఫూర్తి ఎవరు?

మాతృభాషా మరణాల గురించి యునెస్కో హెచ్చరికల కన్నా ముందునుంచే, వేటూరి ప్రభాకరశాస్త్రి తిరుమల రామచంద్ర ప్రభృతులు వ్రాస్తూ వచ్చిన వ్యాసాలు భాషా మక్కువకు కారణం అయ్యాయి. తెలుగు భాషా సంస్కృతుల ప్రాచీనత గురించి చాలా రచనలు చేశాను. 1988లోనే సింధునాగరికతలో తెలుగువారి ఉనికి గురించి విశాలాంధ్ర దినపత్రికలో ఒక వ్యాసం వ్రాసాను. 2004లో 'మాటల ముచ్చట్లు" గ్రంథం వెలువరించాను. మన భాష మూలాలు ప్రాచీన ఆఫ్రికన్ భాషలలో కనిపిస్తున్నాయని పరిశోధకులకు ముడిసరుకును ఇస్తూ - "నైలూ నుంచి కృష్ణ దాకా” గ్రంథాన్ని వ్రాసాను. 2008 ద్రావి విశ్వవిద్యాలయం దాన్ని ప్రచురించగా, 2001లో నా "తెలుగే ప్రాచీనం" గ్రంథాన్ని అధికార భాషా సంఘం ప్రచురించింది. తెలుగు విశ్వవిద్యాలయం నేను వ్రాసిన "మన ఆహారం" గ్రంథాన్ని ప్రచురించింది. తెలుగు వారి తొలి ఆహార చరిత్రకారుడిగా మంచి గుర్తింపు వచ్చింది నాకు. తెలుగు భాషకు ప్రాచీనతా హెూదా రావటానికి ఒక సైనికుడిలా పని చేసాను. కృష్ణాజిల్లా...........

  • Title :Telugu Dheera
  • Author :Gv Purnachandu
  • Publisher :Sri Madhulatha Publications
  • ISBN :MANIMN4429
  • Binding :Papar back
  • Published Date :June, 2017 first print
  • Number Of Pages :243
  • Language :Telugu
  • Availability :instock