చదువరులకు నమస్తే
అంకవన్నె/వన్నియ stapes ossicle in the middle ear, resemblance: stirrup మధ్యచెవిలో సున్నిత అస్థి. పోలిక: రికాబు.
అంకిలి దవడ కీలు joint of the jaws.
అంకిళ్ళు దవడ కీళ్ళు joints in the bones in the region of cheek. అంకెళ్ళు పట్టుకొనిపోవుట, హనుస్తంభము lock-jaw, say in tetanus ధనుర్వాతంలో దవడ కదలలేకపోవడం.
అంకురం రోగక్రిమి a germ.
అంకురం మొలకెత్తు sprout.
అంకురాలు అంకురికలు, శృంగకములు, చూషకాలు villi. ఆంత్ర చూషకాలు intestinal villi.
అంకురోద్భవం మాంసాంకురములు పుట్టుట granulation.
అంగ (అవయవ) శ్రవణం auscultation by stethoscope.
అంగగాని శరీరం వాడిపోవటం.
అంగచ్ఛేదన(ం) అంగవిచ్ఛేదన, అంగభేదనం. అంగం limb పూర్తిగాగాని లేదా కొంతభాగం గాని తీసివేయుట amputation, cutting off a limb or portion of it.
అంగతాపం శరీరం ఉడుకుతో తపించిపోతూ ఉండటం.
అంగబిళ్ళ చూడండి/see మొలబిళ్ళ. చిన్నారి జఘనవేదికను కప్పిఉంచే గుండ్రని conceal the mons pubis by camouflage.
అంగము 1. శరీరము body. ఊర్ధ్వాంగము upper limb లేదా అధోంగము lower limb. శరీర భాగము. 2. ప్రత్యేకంగా పురుషాంగము especially the penis, the rumpy pumpy rudder. 3. కృత్రిమ అంగం artificial limb. అంగరుహము వెంట్రుక a hair............................