• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Telugu Kavya Prabandha Kathalu

Telugu Kavya Prabandha Kathalu By Madagani Buchaiah Gowd

₹ 650

కేయూరబాహు చరిత్రము

తెలుగులో వెలుగు పొందిన సాహిత్య ప్రక్రియలలో కథా సాహిత్యానిది ప్రత్యేకమైన స్థానం. మనకు లభిస్తున్న కథా సాహిత్యంలో కేతన రచించిన దశకుమార చరిత్ర మొట్టమొదటిది. ఆ తరువాత వెలువడిన కేయూరబాహు చరిత్ర ఎంతో విలక్షణమైనది. దీన్ని రచించింది మంచన మహాకవి.

సంస్కృతంలో రాజశేఖరుడు రచించిన విదశాలభంజిక అనే నాటకాన్ని ఆధారంగా చేసుకుని, మూల కథలో చాలా మార్పులు చేసి నేర్పుతో మంచన కేయూర బాహు చరిత్రని రచించాడు. ఈ కథా కావ్యంలో నాలుగు ఆశ్వాసాలు 785 గద్య పద్యాలు ఉన్నాయి.

మన పంచతంత్రంలోని నీతిని బోధించే 22 కథలను సందర్భానుసారంగా స్వీకరించి సరసమైన, సరళమైన శైలిలో కేయూర బాహు చరిత్రని రచించాడు. తెలుగులో నీతి కావ్య కథాకథకులలో అగ్రగణ్యంగా నిలిచాడు. మంచిన తర్వాత వచ్చిన బద్దెన నీతి శాస్త్ర ముక్తావళి, ప్రతాపరుద్రుడి నీతి సారం మొదలైన గ్రంథాలకు కేయూరబాహు చరిత్ర మార్గదర్శకంగా నిలిచింది.

మహారాజు కేయూరబాహుడు

 

అది అతి సుసంపన్నమైన కళింగదేశం. అందులో త్రిపురి అనే పట్టణం ఉంది. మరో అమరావతిలా వెలుగొందుతుంది. ఆ నగరం చుట్టూ లోతైన అగడ్తలు ఉన్నాయి. అందులో నాగకన్యలు జలక్రీడలాడుతుంటారు. ఎత్తైన కోట గోడలపై అప్సరసలు విహరిస్తుంటారు. త్రిపురిలోని అంగళ్ళు ఎంతో విశాలమైనవి. వాటిలో రత్నాలు, ముత్యాలు, బంగారు దిమ్మెలు రాశులుగా పోస్తుంటాయి. దేవతా మందిరాలతో, ఆకాశాన్ని తాకే భవనాలతో, సుందర ఉద్యానవనాలతో ఎంతో అందంగా ఉంటుందా త్రిపురి. పురవీధులలో కొండల్లా ఉండే నామాలు ఏనుగులు తిరుగుతుంటాయి. అంతేకాదు గరుత్మంతుడి కన్నా, మనస్సు కన్నా కూడా వేగంగా పరుగెత్తే గుర్రాలున్నాయి. విద్యావంతులైన బ్రాహ్మణులతో,..............

  • Title :Telugu Kavya Prabandha Kathalu
  • Author :Madagani Buchaiah Gowd
  • Publisher :Madagani Buchaiah Gowd
  • ISBN :MANIMN5694
  • Binding :Hard Binding
  • Published Date :2024
  • Number Of Pages :679
  • Language :Telugu
  • Availability :instock