• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Telugu Padya Natakamulu Anushilana

Telugu Padya Natakamulu Anushilana By Dr Devarapalli Prabhudas

₹ 350

తెలుగు పద్య నాటకములు ·- అనుశీలన (సిద్ధాంత వ్యాసం)
 

మొదటి అథ్యాయం

 

పద్యనాటక స్వరూప స్వభావాలు
 

ఉపోద్ఘాతం

తెలుగు సాహిత్యం లోనే 'పద్యం' అనేది ఒక రసగుళిక, ఒక అందమైన, అమోఘమైన, సమ్మోహనమైన, మధురమైన ఛంద: ప్రక్రియ. రాగ, భావ, తాళయుక్త రసమయి రత్న రాజము, ఒక వజ్రము, ఈ పద్యము. అటువంటి పద్యం శ్రవ్య కావ్యంలో కాక, దృశ్య కావ్యమైన నాటకంలో ఎన్నో అందాలు, హొయలు, వంపులు, సొంపులు సంతరించుకొని జవజీవాలతో ముందుకు సాగుతుంది. ఆంధ్రదేశంలో 'తెలుగునాటకం' ఆవిర్భావం, దానికి పూర్వరంగం, సంస్కృత నాటకాలు తెలుగుజాతి సమున్నతికి దోహద పడిన విధానం పూర్వపు రాజుల కాలంలోని నాట్య విశేషాలు, దృశ్య, కావ్య లక్షణాలు, రసనిష్ఠ, మొ॥ వి చర్చించి పద్యనాటకం రూపుదిద్దుకొన్న విధం వివరించడం జరిగింది. తెలుగు నాటక రంగ చరిత్ర పూర్వపరాలతోపాటు తెలుగులో వెలసిన పద్య నాటకాలు, ఆరంభ వికాస విస్తరణలు వివరించబడ్డాయి. పద్య నాటకాలలోని రకాలు పౌరాణిక, చారిత్రక, జానపద, సాంఘిక నాటకాలు, భారత భాగవత, రామాయణ పరంగా, ఇతర ఇతివృత్తాల పరంగా క్రైస్తవ మత పరంగా రచింపబడిన నాటకాలు వివరించడం జరిగింది.

తెలుగు నాటక రంగం గూర్చి గతంలో చాలా మంది పరిశోధనలు చేశారు. గ్రంధాలు వెలువరించారు. వారిలో ప్రధములు శ్రీ పోణంగి శ్రీరామ అప్పారావుగారు, 'తెలుగు నాటక వికాసం' పేరుతో ఉద్గ్రంధాన్ని రచించారాయన. తెలుగు నాటక పుట్టు పూర్వోత్తరాలతో పాటు ఆనాటి ప్రముఖ నటులను పరిచయం చేసి వారిని గూర్చి వివరించారు. ఆ తరువాత మిక్కిలినేని గారు 'నటరత్నాలు' గ్రంథంలో ఆంధ్రదేశంలోని నాటి ప్రముఖ నటులను పరిచయం చేశారు. వారి బాటలోనే నేను..................

  • Title :Telugu Padya Natakamulu Anushilana
  • Author :Dr Devarapalli Prabhudas
  • Publisher :Dr Devarapalli Prabhudas
  • ISBN :MANIMN5418
  • Binding :Papar Back
  • Published Date :July, 2012
  • Number Of Pages :628
  • Language :Telugu
  • Availability :instock