మూడు కోట్లమంది ముద్దుబిడ్డల గన్న
తెలుగు తల్లి నెపుడు తలచుకొమ్ము
కన్నతల్లి ఘనత కలనైన మరువకు
కలుగు మేలు నీకు తెలుగుబిడ్డ.
అవతరించె నిపుడు 'ఆంధ్ర ప్రదేశము'
తెలుగువారి త్యాగ దీక్ష ఫలము!
ముక్క చెక్కలైన ముక్కోటి బలగమ్ము
కలిసి బ్రతుకు నింక తెలుగుబిడ్డ.
నార్ల చిరంజీవి...........