చిరంజీవులకు చిరంజీవి
- సీతారాం
నార్ల చిరంజీవిని పిల్లలకు పరిచయం చేయటం కోసం ఈ పుస్తకం. ఆయనను తెలుగువారున్నంత వరకూ గుర్తు పెట్టుకునేలా చూడడటం అనే బాధ్యతను శ్రీశ్రీ ప్రింటర్స్ విశ్వేశ్వరరావుగారు తన భుజాల కెత్తుకున్నారు. ఒక తరం వారికి నార్ల చిరంజీవి ఔన్నత్యం ఏమిటో తెలుసు. అభ్యుదయవాదిగా, ప్రగతిశీల ఆలోచనాశీలిగా ప్రజాస్వామ్య, లౌకిక దృక్పథాన్ని తెలుగునాట ప్రచారం చేసినవాడిగా ఖ్యాతి పొందారు. క్రమంగా తెలుగు సాహిత్య, సమాజాలు మహనీయులను, మానవతావాదులను మరిచిపోవటం మొదలుపెట్టాయి. మరచిపోకూడని మనుషులను, మరపుకురాని వ్యక్తులను వారి సౌశీల్యాన్ని గుర్తించి వారి కృషి గురించి ఏదో ఒక రూపేణ తరువాతి తరాలకు అందించవలసిన కర్తవ్యం ఆలోచనాపరులయిన వారందరికీ ఉంది. ఆ కర్తవ్య నిర్వహణలో నేనున్నానని ముందుకొచ్చారు విశ్వేశ్వరరావుగారు.
పిల్లలకోసం నార్ల చిరంజీవి చాలా పనులు చేసేవారని ఈ పుస్తకాలు సాక్ష్యమిస్తున్నాయి. ముఖ్యంగా 'తెలుగుపూలు' 1946లోనే వెలుగు చూసిందని, ప్రచారంలో ఉందని దీని ప్రచురణ వివరాలను చిరంజీవి పొందుపరిచారు. "ఈ చిన్నపుస్తకం నన్ను చిరంజీవిని చేసింది" అన్నారు. పిల్లలు కూడా ఆదరించారని పేర్కొన్నారు. అచ్చంగా నూట పదహారు పద్యాలున్న ఈ రచనను తన గారాల పట్టి అజేయినిసకలకు..............