₹ 400
2009 డిసెంబర్ 9 న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు గురించి కేంద్రప్రభుత్వం ప్రకటన చేసిన తర్వాత.... 2014 జూన్ 2 న తెలంగాణరాష్ట్ర అవతరణకు ముందు.... అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము విభజనకు అనుకూల, వ్యతిరేకవాదాలతో అట్టుడికిపోయింది. ఆవేశకావేషాలు విన్నుంటాయి. అవాంచనీయదృశ్యాలు చోటుచేసుకున్నాయి. ఒకరి వాదాన్ని ఇంకొకరు వినే వాతావరణం లేదు. రాష్ట్రము ఒకటిగా ఉన్న తెలుగు ప్రజల మధ్య సామరస్యం, సంభాషణ ఎక్కడిక్కకడ ముక్కలయ్యే పరిస్థితి.
తెలంగాణ ఉద్యమ చరిత్రే కాదు, తెలుగువారి చరిత్రను కూడా ఈ పుస్తకంలో దర్శించవచ్చు. అంతకంటే ముఖ్యంగా భవిష్యత్తులో తెలుగు ప్రజల సమష్టి ప్రగతికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో, ఎలాంటి వైఖరిని అనుసరించాలో కూడా ఈ పుస్తకం చెబుతుంది.
కురుక్షేత్రయుద్ధంతో మహాభారతం ముగియలేదు. అలాగే తెలంగాణ ఏర్పాటు తెలుగువారి కథకు ముగింపుకాదు, ఎలా కాదో ఈ పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు.
- Title :Telugu Prajala Dasa- Disa
- Author :K Ramachandra Murthy
- Publisher :Emesco Publications
- ISBN :MANIMN0842
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :680
- Language :Telugu
- Availability :instock