అభినందన
సమాజానికి హితాన్ని చేకూర్చేదాన్నే సాహిత్యమని పిలవడంలోనే సాహిత్యానికి భారతీయులిచ్చిన గౌరవం ఎటువంటిదో బోధపడుతుంది. 'రచయితలు గుర్తించబడని శాసన సభ్యులు' అని ప్రముఖ ఇంగ్లీషు కవి షెల్లీ అనడంలోనే ఔచిత్యమేమిటో 'సాహిత్యం' అనే మాటలోనే ప్రతిఫలిస్తోంది. దేశ ప్రజలందరికీ పెద్ద కంఠస్వరం గావడంలోనే సాహిత్య ప్రాముఖ్యమూ, గొప్పతనమూ వెళ్లడవుతుంది. అందుకే స్వాతంత్య్రానంతరం దేశసాహిత్యానికంతా కేంద్రంగా ఉండే 'సాహిత్య అకాదెమి' ఆనాటి ప్రభుత్వం 'స్వయం ప్రతిపత్తి' ఉండే సంస్థగా ఏర్పాటు చేసింది. 1954 లో స్థాపించబడిన 'సాహిత్య అకాదెమి' 1956 నుంచి ఇప్పటివరకు దేశ సాహిత్య కేంద్రంగా, విజయవంతంగా తన కార్యకలాపాలను విస్తరించుకుంటూ వస్తోంది.
"తెలుగు సాహిత్య సేవలో సాహిత్య అకాదెమి" అనే ఈ సిద్ధాంత గ్రంథం కేంద్ర సాహిత్య అకాదెమి ఆధ్వర్యంలో ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాలన్నిటినీ సాకల్యంగా, సమగ్రంగా వివరించే చారిత్రక డాక్యుమెంట్గా రూపొందింది. గడచిన 70 ఏళ్లలో తెలుగు సాహిత్య ప్రాదుర్భావానికి సాహిత్య అకాదెమి చేసిన దోహదమేమిటో ఈ పుస్తకం చదివితే తెలిసిపోతుంది.
'సాహిత్య అకాదెమి' నిర్వహించే సదస్సులన్నీ గమనించినప్పుడు, ప్రతి సంవత్సరం భిన్న విభాగాలలో పురస్కారాలను ప్రకటించినప్పుడు, సాహిత్య అకాదెమి కార్యనిర్వహణ గురించి వివరాలు తెలుసుకోవాలని చాలా మంది కుతూహుల పడుతూ ఉంటారు. అకాడెమి ఆవిర్భావాన్ని గురించి, వాళ్లు నిర్వహించే కార్యక్రమాల గురించి ఈ పుస్తకం సవివరంగా చర్చిస్తుంది................