• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Telugu Sahitya Vimarsha Rara Margam

Telugu Sahitya Vimarsha Rara Margam By Yakub

₹ 180

ఆలోచించదగ్గ రా.రా. మార్గం

పట్టుమని నలభై సాహిత్య వ్యాసాలకు మించి రాయని రా.రా. ను గురించి, సాహిత్య విమర్శలో మనం ఎందుకు ఈ మధ్య గట్టిగా పట్టించుకుంటున్నాం? 'సంవేదన' ఏడు సంచికలు తెలుగు ఆధునిక సాహిత్య విమర్శలో అరుదైనవని, విలువైనవని ఎందుకనుకుంటున్నాం? 'అనువాద సమస్యలు' ఎందుకంత సంచలనం. రేపింది? రా.రా. కంటే విస్తారంగా రాసిన విమర్శకులు ఎంతో మంది ఉన్నారు. కదా! రా.రా విమర్శక లోకంలో కొట్టవచ్చినట్లు ఎందుకు కనపడతాడు?

రా.రా. మార్గం పరిశోధన గ్రంథాన్ని అచ్చువేస్తున్న సమయంలో యాకూబ్ ఈ ప్రశ్నలు వేశాడు. తన పరిశోధక గ్రంథంలోనే యాకూబ్ ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి గట్టిగా ప్రయత్నించాడు కాని ఏ మూలో ఇంకా వివరంగా, ఇంకా స్పష్టంగా, మరింత సాధికారికంగా ముందు ముందు చెప్పాలనుకున్నాడో ఏమో! బహుశా రా.రా. మీద పరిశోధన చేస్తున్నప్పుడు తాను వేసుకున్న ప్రశ్నలను నాకిప్పుడు వేశాడు.

ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పడం అంటే, రా.రా. జీవితంలోకి వెళ్ళవలసి ఉంటుంది. ఆయన వ్యక్తిత్వ వికాసాన్ని గురించి, మేధా సంపత్తిని గురించి, ఆయనలోని యూరో మార్క్సిస్టు ప్రజాతంత్ర దృక్పథాన్ని గురించి మాట్లాడవలసి ఉంటుంది. 1960-70 మధ్యకాలపు కడపలోని ఉపాధ్యాయ, సవ్యసాచి, యుగసాహితి మిత్రుల విస్తృత అధ్యయనాన్ని గురించి, రా.రా. గదిలోనో, కడప పట్టణం ఎర్రముక్కపల్లె మిత్రుల ఇంట్లోనో చేసుకున్న అరమరికలు లేని చర్చల గురించి అభిప్రాయ భేదాలకు, వ్యక్తిగత ఆవేశాలకు మించిన ఆత్మీయతల గురించి, స్నేహార్ద్రత గురించి చెప్పవలసి...................

  • Title :Telugu Sahitya Vimarsha Rara Margam
  • Author :Yakub
  • Publisher :Telangana Publications
  • ISBN :MANIMN6493
  • Binding :Papar back
  • Published Date :Nov, 2024, 2nd print
  • Number Of Pages :160
  • Language :Telugu
  • Availability :instock