• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Telugu Vyakarana Karadeepika

Telugu Vyakarana Karadeepika By Acharya Sriatsa

₹ 225

అక్షర ప్రకరణం
 

శారదా శారదాంభోజ వదనావదనాంబుజే!

| సర్వదా సర్వదా స్మాకం సన్నిధిస్సన్నిధిం క్రియాత్ || |

ఉపోద్ఘాతము

మానవాళి మాట్లాడటానికి, వ్రాయటానికి ఉపయోగపడే సాధనమే భాష. తమతమ అభిప్రాయాల్ని ఇతరులకు తెల్పుటకై ఉపయోగించు పదాల సముదాయమే 'భాష' అని పేర్కొంటారు.

భాషింపబడునది భాష, "భాష వ్యక్తాయాంవాచి" . - అని అమర సింహుడు విశదీకరిస్తున్నాడు. ఈ భాష వాగ్రూపంలోనూ, లిఖిత రూపంలోనూ ఉంటుంది.

మొట్టమొదట సంజ్ఞ (సైగ ల ద్వారా మానవాళి తమతమ భావాల్ని చెప్పుకునేవారు. కాలక్రమేణ 'పాణిని' అను మహర్షి భాష కొఱకు పరమేశ్వరుణ్ని గూర్చి తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ఆనందంతో నృత్యం చేశాడు. ఆ సమయంలో అతని చేతిలో నున్న 'డమరుకం' లయబద్ధంగా ధ్వనించడం జరుగుతూంది. ఆ ధ్వని 'పాణిని' చెవికి శబ్దరూపాలుగా వినబడింది. ఆ శబ్దాలే అక్షర రూపాలు. చివరకు 'కౌముది' అను వైయాకరణ సిద్ధాంత గ్రంథంగా అవతరించింది.

పాణిని మహర్షిచే సూత్రాల ద్వారా వ్యాకరింపబడగా, వానికి 'వరరుచి' వార్తికాలు. పతంజలి మహాభాష్యం అవతరించాయి.

ఆ అక్షర రూపాలే జీవాలై భూమిపై అవతరించి సంస్కృత వాఙ్మయమైంది. అందుండియే తెలుగు భాష ఉద్భవించింది. అక్షరం అంటే నాశనం లేనిది. అర్థవంతమగు కొన్ని అక్షరాల సముదాయమే పదాలు లేక శబ్దాలు. ఈ పదాలే వాక్యాలుగా, మహావాక్యాలుగా ఏర్పడ్డాయి.

తెలుగు భాష సాహిత్య స్వరూపాన్ని సంతరించుకొన్నప్పుడే వ్యాకరణ ప్రస్థానం స్థిరపచుకొంది.

"వ్యాక్రియన్తి సంస్క్రియనే శబ్దా అనేన ఇతి వ్యాకరణమ్” - అని వ్యాకరణ శబ్దానికి వ్యుత్పత్తి ఏర్పడింది. వాక్యరణం వల్ల శబ్దాలు సంస్కరింపబడతాయని అర్థం. సాధు శబ్దాలేవో, అసాధు శబ్దాలేవో గుర్తించి, సాధు శబ్దాల్ని గ్రహించుటకు, అసాధు శబ్దాల్ని సంస్కరించుకొనుటకుగాను వ్యాకరణం రూపొందించబడింది..................

  • Title :Telugu Vyakarana Karadeepika
  • Author :Acharya Sriatsa
  • Publisher :V G S Book Links
  • ISBN :MANIMN5007
  • Binding :Papar back
  • Published Date :April, 2023
  • Number Of Pages :590
  • Language :Telugu
  • Availability :instock