• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Telugulo Kavita Viplavala Swarupam

Telugulo Kavita Viplavala Swarupam By Velcheru Narayana Rao

₹ 150

మా మాట

ప్రపంచంలో భాషలేని మానవ సమాజం లేదు. అట్లాగే భాష ఉన్న తర్వాత సాహిత్యం ఉండని సమాజమూ ఉండదు. అయితే ఆ భాషకు లిపి ఉంటే లిఖిత సాహిత్యం ఉంటుంది. లేకపోతే మౌఖిక సాహిత్యం ఉంటుంది. సహస్రాబ్దాలు, శతాబ్దాలుగా లిఖిత సాహిత్యం కొనసాగుతున్న భాషల్లో ఆ సాహిత్య చరిత్రలు కూడా ఏదో ఒక దశలో ప్రారంభమవుతాయి. లిఖిత సాహిత్యం ఉన్న భాషల్లోనూ మౌఖిక సాహిత్యం ఉంటుంది. లిపి లేని సందర్భాలలో సాహిత్యం మౌఖికంగా పరంపరగా ప్రవహిస్తుంది. ఈ ప్రవాహక్రమ చరిత్ర రికార్డు కావడం ఆ భాషల్లో కష్టమే. లిపి ఉన్న భాషల్లో ఈ మౌఖిక సాహిత్యాన్ని రికార్డు చేసే అవకాశమున్నప్పటికీ లిఖిత సాహిత్యం పండిత సాహిత్యంగాను, మౌఖిక సాహిత్యం పామర సాహిత్యంగానూ పేరుపడి పండితలోకంలో రెండోదాన్ని పట్టించుకోకపోవడం వల్ల అది రికార్డు కాలేదు. ఒక శతాబ్దం కిందటిదాకా ఇదే పరిస్థితి.

దక్షిణ భారతదేశంలో కావలి వెంకట రామస్వామి Biographical Sketches of Dekkan Poets అనే చిన్న పుస్తకంలో అప్పటికి గ్రంథాలు, శాసనాలు తదితర ఆధారాల నుండి, మౌఖిక సంప్రదాయం నుండి లభిస్తున్న సమాచారంతో కవుల జీవిత రేఖాచిత్రాలను రచించాడు. తర్వాత గురజాడ రామమూర్తి కవిజీవితములు రాశాడు. కందుకూరి వీరేశలింగం ఆంధ్రకవుల చరిత్ర రాశాడు. ఆ తర్వాత చాగంటి శేషయ్య ఆంధ్ర కవితరంగిణి రచించాడు. పలువురు పండితులు, చరిత్రకారులు సాహిత్య వాఙ్మయ, కవి చరిత్రలుగా సాహిత్య పరిణామక్రమాన్ని వర్ణిస్తూ అనేక గ్రంథాలు రాశారు.....................

  • Title :Telugulo Kavita Viplavala Swarupam
  • Author :Velcheru Narayana Rao
  • Publisher :Emasco Books pvt.L.td.
  • ISBN :MANIMN4226
  • Binding :Papar back
  • Published Date :Feb, 2023 forth print
  • Number Of Pages :222
  • Language :Telugu
  • Availability :instock