₹ 125
ఆలయాలు మన హిందూ సాంస్కృతిక ఆనవాళ్ళని చెప్పవచ్చు. ఆలయదర్శనం పవిత్రమైన కార్యంగా పరిగణిస్తాం. అందునా పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల లభించే అనిర్వచనీయమైన అనుభూతి వర్ణనాతీతం. ఋషులు, మునులు, దేవతలు నడయాడిన, కొలిచిన క్షేత్రాల మహిమ మానవులకు జ్ఞానాన్ని, ముక్తిని ప్రసాదిస్తాయి అని అనటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. అందుకే దేవాలయాలను నిత్య చైతన్య కేంద్రాలు అని అన్నారు.
తొలిపూజలు అందుకునే గణనాథుని పూజించటం మనకు అనాదిగా వస్తున్న పరంపర. మన తెలుగునాట నెలకొనియున్న ప్రసిద్ధ గణపతి ఆలయాలు వివరాలను ఇంకా గణేశ ఆరాధన, స్తోత్రాలను ఈ పుస్తకంలో పొందుపరచటం జరిగింది, పురాణ చరిత్రకు మరియు వినాయకమూర్తులలో ఉన్న వైవిధ్యతను పరిగణలోకి తీసుకుని అక్షరరూపం కల్పించాను.
-కప్పగంతు వెంకట రమణమూర్తి.
- Title :Telugunati Prasidda Ganapathi Alayalu
- Author :Kappaganthu Venkata Ramanamurthy
- Publisher :Global News
- ISBN :MANIMN0745
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :211
- Language :Telugu
- Availability :instock