• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Tenali Ramakrishna Kavi Sastriya Parisilana

Tenali Ramakrishna Kavi Sastriya Parisilana By Mattevi Ravindranadh

₹ 1000

మనవి

తెనాలి రామకృష్ణ కవి జీవితాన్నీ, రచనలనూ స్థూలంగా

పరిచయం చేయడమే యీ గ్రంథ లక్ష్యం. సాధారణంగా కవులకూ, రచయితలకూ తమ రచనల ద్వారా కీర్తి వస్తుంది. కానీ రామకృష్ణ కవి సంగతి వేరు. ఆయన రచనలు ఏమిటో తెలియని అసంఖ్యాకమైన పాఠకులకు కూడా ఆయన సుపరిచితుడు. అలా తన కావ్యాలకన్నా వ్యక్తిగా ఆయన ఎక్కువ ప్రసిద్ధుడు.

ఆయన పేరిట ప్రచారంలో వున్న అసంఖ్యాకమైన హాస్య కథల కారణంగా జన సామాన్యం రామకృష్ణుడిని ఓ హాస్య కవిగానో, వికట కవిగానో, సమస్యా పూరణంలో దిట్టయైన సమయోచిత ప్రజ్ఞావంతునిగానో మాత్రమే ఎరుగుదురు. విద్యావేత్తలకు తప్ప సామాన్య పాఠకులకు రామకృష్ణ కవి ఓ మహాకవిగా తెలియక పోవడం శోచనీయం.

తెలుగు సాహిత్యంతో అంతో - యింతో పరిచయమున్న చదువరులకు తప్ప 'పాండురంగ మాహాత్మ్యము' ఆయన వ్రాసిన కావ్యమని తెలియక పోవడం కూడా కద్దు. అదో మహా కావ్యం. ఆంధ్ర పంచ కావ్యాలలో అది ఒకటి. ఇతరుల సంగతెందుకు ? నా సంగతే తీసుకుంటే కీ.శే. యన్.టి.ఆర్. నిర్మించిన 'పాండురంగ మాహాత్మ్యం' చలన చిత్రం..............

  • Title :Tenali Ramakrishna Kavi Sastriya Parisilana
  • Author :Mattevi Ravindranadh
  • Publisher :Vignana vedika, Tenali
  • ISBN :MANIMN3824
  • Binding :Hard binding
  • Published Date :Oct, 2022 2nd print
  • Number Of Pages :916
  • Language :Telugu
  • Availability :instock