పెళ్ళయి ఏడేళ్ళయ్యాక భర్తకి పరస్త్రీ పొందు మీద వ్యామోహం కలుగుతుందని పాశ్చాత్యుల నమ్మకం. దీన్ని 'సెవెన్ ఇయర్ ఇచ్'గా పేర్కొంటారు. అలాంటి సమస్యలో చిక్కుకున్న వరుణ్ ఎదుర్కొన్న అనుభవాలు నవ్వు తెప్పిస్తాయి. అదే సమయంలో వరుణ్ 62 ఏళ్ళ మామగారు త్రయంబకం సెక్స్ ప్లాయిట్స్ కూడా వినోదాన్ని కలిగిస్తాయి.
చక్కటి సందేశంతో ముగిసే ఈ నవల్లోని 'డర్టీ జోక్స్ క్లబ్' పాఠకులని బాగా ఆకర్షిస్తుంది. దీన్ని సినిమాగా తీసినప్పుడు నిషేధించాలనే అర్జీని హైకోర్ట్ కొట్టేసింది. హాస్యప్రియులనీ ఆకర్షించే 'తేనెటీగ' మల్లాది వెంకట కృష్ణమూర్తి రచన.