అనగనగా...
“రజా... రమా... రయ్యాన్...'""
"ఇలా రండి...మీకొక కథ చెప్తాను.”
" అని ఒకామె ఉంది.”
“అరె... బానూ అంటే మీరేగా? రమా నవ్వుతూ అంది.
"అయ్యో? మిమ్ముల్ని మీరే మర్చిపోయారా ఏంటి?” రజా ఎంతో ఆశ్చర్యంగా అడిగింది.
"బానూ అసలెవరో మీకు చెప్తాగా?” రయ్యాన్ నా ముఖాన్ని పైకెత్తి మెల్లగా అన్నాడు.
ఆ ముగ్గురు పిల్లలూ పకపక నవ్వసాగారు.
నేను రయ్యాన్ వైపు చూస్తున్నాను.
నేనెవరో బహుశా రయ్యాన్ చెప్తాడనుకుంటా.
నేనెవరిని...?
నేనెవరిని...?
దీని గురించే నేనూ ఆలోచిస్తున్నాను.
నా బాల్యమంతా ఎలా గడిచిందో చెప్పాల్సిందిగా నన్ను చాలా మంది అడిగారు. మన కళ్ళముందు కరిగిపోయిన కాలాన్నీ.. మర్చిపోయే జ్ఞాపకాలనే మనం ఎపుడూ గుర్తుకుతెచ్చుకుంటాం..................