ఫిలాటస్ అనే చెట్టును అంటుకొని ఉండే కప్ప గురించి తెలుసుకుందామా...
అనగనగా సిస్పర షోల అడవిలో ఒక ఫిలాటస్ కప్ప ఉండేది. కప్పని అతని స్నేహితులు బుజ్జి అని పిలుస్తారు. ఇంతవరకూ తానున్న పెద్ద చెట్టు మీద నుండి ఎన్నడూ కిందికి దిగి ఎరుగడు. బుజ్జి. బుజ్జి ఏమిటి, వాళ్ళ నాన్నా దిగలేదు. మరి వాళ్ళమ్మా దిగలేదు. వాళ్ళ తాతలు, ముత్తాతలు కూడా దిగలేదట. మరి అంతకు ముందో? ఏమో ఎవరికి తెలుసు? అందరికీ గుర్తున్నంత వరకూ వాళ్ళంతా పెద్ద చెట్టుమీదే కాపురం ఉంటున్నారు. బుజ్జి ఆ పెద్ద చెట్టు మీదే, ఒక చిన్న సందులో పుట్టాడు. చిరుకప్పలా ఆ చెట్టు తొర్రల్లో చేరుకున్న చిన్ని నీటి గుంటల్లో తిరుగాడాడు. అచ్చం వాళ్ళ నాన్న అంతకు ముందు తిరిగినట్లే.
Introducing Philautus, the tree frog
Philautus, or Bujji, as he was known to some friends, had not come down from the Big Tree his whole life. But then, neither had his father. Or mother. Or grandparents. Or great grandparents. Before that, who knew? They had lived there on the Big Tree for as long as anyone could remember. He
had been born on the Big Tree, in a small nook, and splashed around as a little froglet in the tiny puddles of water that collected in the tree holes. As had his father before him...............