మానవుని నిర్మించే తీరు
'ఎంతగా దేవుని వలె! విలియం షేక్స్పియర్, - హామ్లెట్
చాలాకాలం క్రితం, నేను అమెరికాలో జూనియర్ హైస్కూల్ విద్యార్థిగా ఉన్నప్పటి మాట.. మానవ శరీరంలో ఉండే రసాయనాలు అన్నింటినీ హార్డ్వేర్ స్టోర్ అయిదు డాలర్లు, కొంచెం కొంచెం అటుయిటుగా పెట్టి కొనవచ్చునని బయాలజీ టీచర్ చెప్పడం గుర్తుంది. సరిగ్గా ఆమె చెప్పిన మొత్తం గుర్తులేదు. 2.97 డాలర్లు లేదా 13.50 డాలర్లు అయ్యుండవచ్చు. 1960 దశకం నాటి లెక్క ప్రకారం కూడా అది చాలా తక్కువ సొమ్ము. నావంటి వంగిన, మొటిమలున్న మనిషిని పెద్దగా పెట్టుబడి అవసరం లేకుండానే తయారు చేయవచ్చును అన్న ఆలోచన కలిగించిన ఆశ్చర్యం నాకు యింకా గుర్తుంది.
ఆ సంగతి తెలిసిన తరువాత నాలో వినయభావం కనిపించేంతగా కలిగింది. అది నాలో యిన్ని సంవత్సరాలుగా కొనసాగింది. ఇంతకూ ప్రశ్న: అది నిజమేనా? మనం నిజంగా విలువలేని వాళ్లమా? అని.
చాలామంది అధికారంగల వాళ్లు (అంటే బహుశః శుక్రవారం నాడు డేట్ కుదరని సైన్స్ పట్టభద్రులు అనుకోవాలేమో?) యీ సందర్భాలలో, కేవలం