• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

The God Father Series Omerta Mario Puzo

The God Father Series Omerta Mario Puzo By Soujanya

₹ 350

ఉపక్రమణిక
 

1967

ఆ గ్రామంలో ఉన్నవి అన్నీ రాతికట్టు ఇళ్లే. మధ్యధరా ప్రాంతంలో సిసిలీ దేశంలో ఉంది ఆ గ్రామం. దాని పేరు కేస్ యెల్లమరే డెల్ గోల్ఫ్. పేరు పొందిన మాఫియా నాయకుడు విన్సెంజో జెనో ఆ గ్రామంలో మరణశయ్య మీద ఉన్నాడు. ఆయన ఎంతో గౌరవనీయుడు.

నిజాయితీగా, నిష్పక్షపాతంగా తీర్పు చెప్పడంలో ఆయన పేరు పడ్డాడు. తన నుండి సహాయం పొందిన వారికి ఆయన వెన్నుదన్నుగా నిలబడేవాడు. అవసరంలో ఉన్న వారిని ఆదుకునేవాడు. అదే సమయంలో తన తీర్పుల అమలు పట్ల అడ్డదిడ్డంగా వ్యవహరించేవారిని అతి కౄరంగా శిక్షించేవాడు.

విన్సెంజో జెనోను అభిమానించేవారికి కొదువ లేదు.

మరణశయ్య చుట్టూ ముగ్గురు వ్యక్తులు నిలబడి ఉన్నారు. ఒకప్పుడు ఆయన వద్ద పని చేసిన అనుయాయులే వాళ్లు. కాలక్రమంలో ఎవరికి వారుగా తమ శక్తియుక్తులతో ముగ్గురూ మాఫియా నాయకులుగా ఎదిగారు. సొంత బలం పెంచుకున్నారు. ఉన్నత స్థితికి చేరుకున్నారు.

న్యూ యార్క్ నుండి, సిసిలీ దేశవాసుడిగా రేమండ్ ఏప్రిల్, సిసిలీలో ఒక పట్టణం పాలెమో నుండి అక్టోవియెస్ బియాంకో, చికాగో నుండి బెనిటో క్రాక్సి - వీరు ముగ్గురూ తమ అంతిమ నివాళిని సమర్పించుకోవడానికి ఏతెంచారు. డాన్ విన్సెంజో జెనో తన జీవితపు చివరి గడియలలో ఉన్నాడు. వాస్తవంగా తమ ప్రతిభ చూపించిన ముఠా నాయకులలో ఆయన చివరివాడు. పాత కాలపు సాంప్రదాయాలను ఆయన తు.చ. తప్పకుండా పాటించాడు. తన జీవితం అంతా అలాగే గడిపాడు. వ్యాపారవేత్తల నుండి ఆయన కప్పం సేకరిస్తూ వచ్చేవాడు. ఖచితమైన మొత్తాలలో ఉండేది ఆ కప్పం..............

  • Title :The God Father Series Omerta Mario Puzo
  • Author :Soujanya
  • Publisher :Sri Books, Vja
  • ISBN :MANIMN5884
  • Binding :Papar Back
  • Published Date :Nov, 2024
  • Number Of Pages :351
  • Language :Telugu
  • Availability :instock