• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

The Greek Tragedies

The Greek Tragedies By Dr Lanka Siva Rama Prasad

₹ 200

          ప్రాచీన గ్రీసుదేశం, ఆసియా మైనర్ లో ప్రసిద్ధిగాంచిన ఈ విషాదాంత నాటకాలు (ట్రాజెడీ) క్రీస్తుపూర్వం అయిదవ శతాబ్ది నాటికి ఏథెన్స్ లో ఉచ్ఛస్థితి నందుకున్నాయి. ఈ ట్రాజెడీల రచయితలలో ప్రఖ్యాతి గాంచినవారు ముగ్గురు. ఎస్కిలస్ (Aeschylus - 525-456 B.C.) అతడు వ్రాసిన 80 నాటకాల్లో ఏడు మాత్రమే లభ్యమవుతున్నాయి. సోఫాక్లిస్ (Sophocles-496-406 BC) 123 నాటకాల్లో లభ్యమవుతున్నవి7; యురిపిడిస్ (Eurypides 480-406 BC) - 90 నాటకాల్లో 19 లభ్యమవుతున్నవి.

             అరిస్టాటిల్ సిద్ధాంతం ప్రకారం- ట్రాజెడీలు డయొనైసిస్ ఆరాధకులు గానం చేసే స్తోత్రాలైన డిథైరాంబ్ (Dithyramb) ల నుంచి పరిణామం చెందాయి. ఏక్టర్ (Actor)- నటుడుకి సమానమైన గ్రీకు పదం - Hypocrites హైపొకైటిస్- అంటే సమాధానం చెప్పేవాడు లేక వివరణ ఇచ్చేవాడు (Interpreter) అని అర్థం .

            నాటకంలో తొలిసారిగా వేషం వేసింది - థెస్పిస్ (Thespis) అనే అతడని వాడుకలో ఉన్నది. పీసి టస్ (Peisistratus) తొలి నాటక బహుమతిని అందుకున్నాడట. ప్రొలోగ్ (ఉపోద్ఘాతం )ను ప్రవేశపెట్టింది. 'థ్పెస్' అని థెమిస్టిటస్ (Themistitus - 4th Century B.C.) అనే రచయిత పేర్కొన్నాడు.

           ఎస్కిలస్ (Aeschylus)- ట్రాజెడీలకుండాల్సిన లక్షణాలను నిర్వచించాడు. ట్రిలోజి (Trilogy)ని ప్రవేశపెట్టిందే అతడే. (ఒకే పెద్ద కథను మూడు భాగాలుగా చెప్పడమే ట్రిలోజి). రెండవ పాత్రను నాటకంలో ప్రవేశపెట్టిన వాడు ఎస్కిలస్. ఇతడి నాటకాల్లో నీతి బాహ్యతకు చోటుండేది కాదు. ఎస్కిలస్ రచించిన -- (467 B.C.) లెయాస్, ఇడిపస్, సెవెన్ ఎగైనస్ట్ రెబెస్ - ట్రిలోజికి ప్రధమ బహుమతి లభించింది.

  • Title :The Greek Tragedies
  • Author :Dr Lanka Siva Rama Prasad
  • Publisher :Dr.Lanka Siva Rama Prasad
  • ISBN :MANIMN2531
  • Binding :Paerback
  • Published Date :2014
  • Number Of Pages :203
  • Language :Telugu
  • Availability :instock