ద మెంటల్ బాడీ
(మనోమయ శరీరం)
మనం మనోమయ శరీరం గురించి చర్చించుకోబోతున్నాం. మానవులము, మానవ శరీరధారులము అయిన మనందరం కూడా మనువు యొక్క సంతతులమే! అందుచేత మనం జీవించేస్థాయి మనోమయ శరీరంలో ఉండాలి, అంతకంటే తక్కువకి మనము దిగకూడదు. ఆ స్థితికి మనము ఎదగాలి అంటే ఈ మూడింటిని ఫిజికల్, యాస్టల్, మెంటల్ని మీరు వదిలేయాలి, దాటేయాలి, మీరు ఈ త్రీ ప్లేన్స్లో పట్టు సాధించాలి. ఈ మూడు తలాలలో మీరు అధిపతి అవ్వాలి అంటే అన్నమయ శరీరానికి, ప్రాణమయ శరీరానికి మీరు అధిపతి అవ్వాలి, మనోమయ శరీరానికి కూడా మీరు ఆధిపత్యం వహించటానికి ప్రయత్నించాలి. మానవజన్మ యొక్క ఫస్ట్ స్టెప్ అది, అక్కడ నుంచి ప్రారంభం చెయ్యాలి. కంట్రోలింగ్ మైండ్, కంట్రోలింగ్ మైండ్ నుంచి కాంక్రీట్ మైండ్, ముందు మనస్సుని మన వశంలోకి తెచ్చుకోవాలి..................