తలుపు తట్టిన అతిథి
తను చనిపోవాలని నిర్ణయించుకోటానికి 27 గంటల ముందు... నోరా సీడ్ శిధిలమైన సోఫా మీద కూర్చుని ఉంది. సంతోషంగా జీవిస్తున్న ఇతరులు గురించి ఆలోచించసాగింది. జీవితం గురించి తనేదో అనుకుంటే మరేదో సంభవించింది.
అంతలో ఎవరో ఆమె డోర్ బెల్ మోగించారు.
తలుపు దగ్గరకు వెళ్లాలా లేదా అని క్షణకాలం తటపటాయించింది. అప్పుడు సమయం రాత్రి 9 కూడా కాలేదు. అప్పటికే ఆమె నైట్ డ్రస్ లోకి మారిపోయింది. బాగా పెద్దగా ఉన్న టీషర్టు, రంగురంగుల పైజామా ధరించి ఉంది.
చెప్పులు వేసుకుని వెళ్లి తలుపు తీసింది. వచ్చిన వ్యక్తి తనకు పరిచయస్థుడే.
అతను బాగా పొడవుగా, బక్కపలచగా చూడటానికి పిల్లాడిలా ఉన్నాడు. అతని ముఖంలో దయ ... ఆ కళ్లు తీక్షణంగా మెరుస్తున్నాయి. దేన్నయినా శోధించేట్టుగా ఉన్నాయి.
అతని రాక ఆశ్చర్యం కలిగించింది. అదే సమయంలో ఆనందం కూడా కలిగింది. బయట చలి, వర్షం ఉన్నా, వేడివాతావారణంలో ఉన్నట్టు అతను చెమటలు కక్కుతున్నాడు. తనున్న పరిస్థితుల్లో అతనిరాక కొంత అసౌకర్యం
కలిగించిన మాట నిజం.
ఆమె ఒంటరితనంతో సతమతమవుతోంది. తత్వశాస్త్రం చదువుకుంది. ఈ అసంబద్ధమైన విశ్వంలో మానవీయంగా మసలటం అనేది ప్రాథమికమైన అవసరం అని అస్తిత్వ తత్వశాస్త్రం ద్వారా గ్రహించింది. ఇప్పుడు అతని రాకను ఆమె స్వాగతించింది...............