• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

The Wisdom Bridge

The Wisdom Bridge By Kamalesh D Patel

₹ 399

ప్రియమైన తల్లిదండ్రులారా

నేనొకసారి ఒక గురువు, ఆయన వద్ద ఉండి చదువుకొన్న శిష్యుడి కథ చదివాను. చాలాకాలం శిక్షణ తరువాత, ఒకరోజు గురువు ఆ శిష్యుడిని పిలిచి, చదువు పూర్తయిందని, ఇక ప్రపంచంలోకి వెళ్ళి తన కాళ్లమీద తాను నిలబడవచ్చనీ చెప్పాడు. గురుకులం వదిలి వెళ్ళవలసిన రోజున గురువుగారి భార్య ఏదో ఒక సాకుతో సాయంకాలం వరకు ఆ శిష్యుని వెళ్ళనివ్వకుండా చేసింది. చివరకు అయిష్టంగానే శిష్యుని చేతికి ఒక లాంతరు, దారిలో తినడానికి నచ్చిన ఆహారం ఇచ్చింది. ఈ సుదీర్ఘ ప్రయాణం మురికి త్రోవల లోంచి, అడవిలోంచి జరగవలసి ఉంది. కొంతదూరం వెళ్ళగానే శిష్యునికి తన గురువు వెనక్కి రమ్మని పిలవడం వినిపించింది. వెనుకకు వెళ్ళగానే గురువు, శిష్యుడి చేతిలోని లాంతరును తీసేసుకుని, 'నాయనా! ఇంక నీవు ఇంటికి వెళ్ళవచ్చు. నీవు జీవితంలో పైకి రావాలి' అని దీవించాడు.

గురువు లాంతరును ఎందుకు తీసేసుకున్నట్టు? శిష్యుడు క్షేమంగా ఇంటికి చేరుకున్నాడా? చీకటి పడ్డ తరువాతే శిష్యుడిని ఎందుకు వెళ్ళనిచ్చారు? పిల్లల్ని పెంచే ప్రతి తల్లీ, తండ్రీ ఎదుర్కొనే సవాళ్ళు ఈ ప్రశ్నల ద్వారా ఈ కథలో ఇమిడి ఉంటాయి. ఈ కథలో గురువు క్రమశిక్షణకు గుర్తు. ఆయన భార్య ప్రేమకు గుర్తు. లాంతరును వెనక్కి తీసేసుకోవటంలోని అర్థం, పిల్లలకు మార్గదర్శనం చేయాల్సింది వారి అంతరంగ వెలుగే అని తెలియజేయడం.

తల్లిదండ్రులుగా మనం మన పిల్లల్ని జాగ్రత్తగా పెంచుతాం, ప్రేమిస్తాం. పోషిస్తాం. అయితే ఏదో ఒకరోజు వారు ఈ సురక్షితమైన ఇంటి వాతావరణంనుండి బయటకు అడుగుపెట్టాలి. ద విజ్ఞమ్ బ్రిడ్జ్ తల్లిదండ్రులకు వారి పిల్లల వికాసంలో వివేకవంతంగా..............

  • Title :The Wisdom Bridge
  • Author :Kamalesh D Patel
  • Publisher :Manjul Pablication House
  • ISBN :MANIMN4159
  • Binding :Hard Binding
  • Published Date :2022
  • Number Of Pages :287
  • Language :Telugu
  • Availability :instock