• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Thirukkural

Thirukkural By Tiruvalluvar

₹ 350

ఆచార్యుల అభినందనము

ఆలోచనలన్నీ సమున్నతంగా ఉండాలని నిర్ధారించి

హృదయంలో పెల్లుబికే ఆలోచనలను పరిశీలించి

మతసంబంధమైన ఊహాపోహలను తిరస్కరించి

ఉపకార చింతనయే స్వీకార యోగ్యమైనదని చెప్పారు వళ్లువర్.

 

చేసే వృత్తుల్లోనే భేదంగాని పెరిమె ఏ ఒక్కదానికో కాదనీ

పుట్టుకతో ప్రాణులన్నీ సమానులేనని చెప్పి

పుట్టుక కారణంగా వర్ణానికో నీతి అని చెప్పే

దుర్నీతి పరులైన మనునీతివాదులను నిరసించారు వళ్లువర్
 

కీర్తితోపాటు ఐశ్వర్యాన్నిచ్చే ధర్మం కంటే మించినది వేరేదీ లేదనీ,

సోమరితనానికి మించిన హాని వేరేదీ లేదనీ, నిష్కళంకమైన హృదయంలో

సంతోషం పొంగులు వారుతుందనీ, ఈర్ష్యాసూయలు దూరం చేసుకోవాలనీ

కఠినంగా మాట్లాడ్డం మానుకోవడమే ధర్మమనీ

ప్రయత్నం వలన ప్రయోజనం హాని కలిగించక సంపాదించాలన్నదేననీ

నిష్కళంకమైన ప్రేమానందాలే జీవితానికి సహచరులనీ

వంచన లేని మనోబంధం పంచేంద్రియాలను జయించగలదనీ

దోషరహితమూ, ప్రశస్తమూ అయిన జీవన మార్గాన్ని దర్శించారు వళ్లువర్.

 

భగవంతుడు, దేవుడు, సర్వేశ్వరుడు అంటూ ప్రార్ధిస్తారు

పరిపూర్ణగుణం పొందడానికి 'ప్రార్థన' ఏది? అనీ

మరుజన్మ, ఆత్మ, స్వర్గం అని విశ్వసిస్తారు

ఈ జన్మలో కీర్తిని పొందడానికి మార్గం ఏది? అనీ

ఎత్తిన జన్మ 'కర్మఫలితం' అనీ, 'తలవిధి' అనీ నమ్ముతారు

పరిభ్రమించే ప్రకృతి పరిణామమే 'విధి' అనీ

ప్రజల అంతరంగ అంధకారాన్ని తొలగించి వివేకాన్ని పెంపొందించి.........

  • Title :Thirukkural
  • Author :Tiruvalluvar
  • Publisher :Hydrabad Book Trust
  • ISBN :MANIMN3799
  • Binding :Papar back
  • Published Date :2022
  • Number Of Pages :321
  • Language :Telugu
  • Availability :instock