పొడుపు కథల బుట్ట
తోకలేని పిట్ట
శ్రీ పుల్లా రామాంజనేయులుగారి తోకలేని పిట్ట 10+ వయసున్న పిల్లలే కాకుండా పెద్దలు కూడా చదువుకో దగిన ఒక బాలల నవల. తెలుగులో పిల్లల కోసం నవలలు చాలా తక్కువగా వచ్చాయని చెప్పవచ్చు. ప్రారంభంలో (1950 నుండి) చింతా దీక్షితులు 'లీలా సుందరి', అవసరాల రామకృష్ణారావు 'గణిత విశారద' వంటి జానపద నవలలు, గీత సుబ్బారావు 'పారిపోయిన బఠాని'; న్యాయపతి రాఘవరావు 'పిల్లల దొంగ' వంటి సాంఘిక నవలలు, రావి ఎస్ అవధాని 'మహావీర కర్ణ'; పండరీ బోస్ 'తారకాసురుడు' వంటి పురాణ నవలలు, పాలంకి వెంకట రామచంద్రమూర్తి 'బంగారు తల్లి'; విద్వాన్ కొండూరి నరసింహం 'తానాజీ' వంటి చారిత్రక నవలలు మొదలైన వాటితో పాటు కొన్ని అనువాద నవలలూ వచ్చాయి. 1970 తర్వాత పిల్లల కోసం పాకెట్ సైజ్ లో బాలల నవలలు రావడం మొదలు అయ్యింది...................