• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Tholi Telugu Sasanam

Tholi Telugu Sasanam By Dr Vempalli Gangadhar

₹ 60

తొలి తెలుగు శిలాక్షరం

తెలుగు భాషకు వెలుగు పూలు పూయించిన తొలి తెలుగు శాసనం... కలమళ్ళ శాసనం.

2013వ సంవత్సరం 'తెలుగు భాష, సంస్కృతి వికాస సంవత్సరం'. అటు చరిత్రకు - ఇటు భాషకు మధ్య నిలువెత్తు శిఖరంలా నిలిచిన తొలి తెలుగు శాసనం ఎక్కడుంది? చరిత్రకందని మిస్టరీలా మారింది. క్రీ.శ. 575 ప్రాంతానికి చెందిన రేనాటి చోళరాజు ధనుంజయవర్మ కడప జిల్లాలోని కలమళ్ళ గ్రామంలో గల శ్రీ చెన్నకేశవస్వామి ఆలయం ప్రాంగణంలో వేయించిన దాన శాసనం తొలి తెలుగు శాసనంగా చరిత్రలో గుర్తింపు పొందింది. తెలుగు భాషకు ప్రాచీన హోదా లభించడానికి చూపిన ఆధారాల్లో ప్రధానమైనది కూడా! ప్రస్తుతం ఈ శాసనం ఎక్కడుంది? ఈ ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేకపోతున్నారు. 1904 సం.లో మద్రాసు నుంచి వచ్చిన శాసన పరిశోధన విభాగంవారు తమ వెంట దానిని తీసుకెళ్ళిపోయినట్లు యింతవరకు భావిస్తూ వచ్చారు. ఇదే అంశాన్ని ఆధారాలు చూపిస్తూ నేను సమాచార హక్కు చట్టం క్రింద చెన్నైలోని ఎగ్మోర్ ప్రభుత్వ మ్యూజియాన్ని సంప్రదించినప్పుడు దిగ్భ్రాంతి కల్గించే అంశం బయటపడింది. 07 జనవరి 2013 నాడు శాసనం నమూనా ప్రతిని, స్క్రిప్ట్ను జతపర్చుతూ సమగ్ర వివరాలతో చెన్నై 'ఎగ్మోర్' ప్రభుత్వ మ్యూజియం వారిని ప్రశ్నించడం జరిగింది.

తొలి తెలుగు శాసనం, రేనాటి చోళరాజు ధనుంజయ వర్మ వేయించిన శాసనంకు సంబంధించిన వివరాలు, మ్యూజియంలో ప్రదర్శిస్తున్నారా? దానిని తగిన విధంగా సంరక్షిస్తున్నారా? వంటి ప్రశ్నలను వారి ముందుంచినప్పుడు - అలాంటి శాసనమేదీ తమ వద్ద లేదని - చెన్నై ప్రభుత్వ మ్యూజియం అసిస్టెంట్ డైరెక్టర్ తిరు ఎస్. సెల్వ అరసు, అధికారికంగా లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు......................

  • Title :Tholi Telugu Sasanam
  • Author :Dr Vempalli Gangadhar
  • Publisher :Devineni Seetaravamma Foundation
  • ISBN :MANIMN6102
  • Binding :Papar Back
  • Published Date :Dec, 2013
  • Number Of Pages :101
  • Language :Telugu
  • Availability :instock