కథాసంగ్రహము
గృహస్థాశ్రమధర్మమునకు ఫలము సంతానము. అట్టి సంతానము లేమి, మృకండమరుద్వతులను మునిదంపతులు సంతానమునకై కలకాలము వరించు చుండిరి. ఒక దినమున బ్రహ్మలో కావలోకన కుతూహులు డై మృకండముని భరద్వాజునితో బ్రహ్మలోకమున కేగెను. కాని మృకండుడు సంతాన విహీనుడగుటచే ద్వారపాలకు అతనిని లోనికి బోవ డ్డగించిరి అతనట్లు అవమానభారముతో గృఘోన్ముఖుడాయెను. ఇక నింటివద్ద మృకండపల్ని యగు మరుద్వతి ముగ్గురు మునిపత్నుల కాతిధ్య మొసంగునపుడు వారు ఆమె సంతానవిహీనురాలగు పెరిగి గొడ్రాలి యాతిధ్యమును స్వీకరింపమని సిద్ధాన్న మును వీడిచనిరి.
ఇట్లు భార్యాభర్త లిరువు రవమానదుఃఖాక్రాంతులై యుఁడగా త్రిలోకసంచారియగు నారదమహామునివచ్చి వారల నోదార్చి పరమేశ్వరుని గూర్చి తపమాచరింపుడని యుపదేశించెను.
ఆపే యాదంపతులు తపస్సు చేయగా పార్వతీ పరమేశ్వరులు ప్రత్యే క్షమై వారికి సుపుత్రవగదాన మొసంగిగి, ఆతడే మన కథానాయకుడగు భక్త మార్కండేయుడు. ఇక సృష్టికర్తయగు బ్రహ్మ మార్కండేయునికి | పదునా రేండ్లు మాత్రమే ఆయుర్దాయ మొసంగెను.
మార్కండేయుడు బాల్యమునుండియు తనతోడి బాలురతో నగూడి "శివపూజలను గావింప మొదలిడెను. రానురాను అతని భక్తి మరింత ప్రదీప్త మయ్యెను. నారదుడతని భక్తికి మిక్కిలి మెచ్చి చిరంజీవిగా దీవించెను.