కంపనము ఎలా పనిచేస్తుంది
ప్రకృతిలో అన్నింటి మాదిరి ఈ ప్రకాశవంత కంపనములువాటి ఉత్పత్తి స్థానము నుండి పెరుగుతున్న దూరమునకు తగ్గట్లు వాటి శక్తిని కోల్పోతాయి. అయితే యిందులో ఒక అదనపు కొలత చేరి వుండుట వలన నిష్పత్తి లోని వ్యత్యాసము చతురస్రమునకు బదులుగా ఘనము యొక్క దూరమునకు సంబంధించినట్లుగా వుండవచ్చును. మరలా, యితర అన్ని కంపనముల మాదిరి వాటికి అవకాశము యిచ్చినపుడు అవి పునరుత్పత్తి గావించే ఉద్దేశ్యము వుంటుంది.
కనుక అవి మరో మానసిక శరీరాన్ని ఎపుడు తాకినా అది అందులో తమ కదలికల యొక్క వేగాన్ని పుట్టించే ఉద్దేశ్యముతో వుంటుంది. అనగా, ఎవరి మానసిక శరీరాన్ని ఈ తరంగాలు తాకాయో, ఆ మనిషి దృష్టి కోణం నుండి అంతకు ముందు యింకొక ఆలోచనాపరుడి మనస్సులో ఏవిధమైన ఆలోచనలు జనించి ఈ తరంగాలను ముందుకు పంపాయో, అదే రకపు ఆలోచనలని అతని మనస్సులో పుట్టించే ఉద్ధేశ్యము వుంటుంది. ఆ ఆలోచనా తరంగాలు ఎంత దూరమునకు చొచ్చుకుపోతాయో మరియు యితరుల మానసిక శరీరాల మీద ఎంతటి బలంతో పట్టువిడువక తాకుతాయో అన్న అంశము అసలు ఆలోచనల యొక్క బలము మరియు స్పష్టత మీద ఆధారపడి ఉంటుంది. ఈ విధముగా ఆలోచించువాడు, మాట్లాడేవాడు యిద్దరూ ఒకే స్థితిలో................