తూరుపు సంధ్యారాగం
కౌసల్యపురం రోడ్ హాల్ట్!
అదొక చిన్న రైల్వే స్టేషన్...
పాసింజర్ వచ్చే సమయం
శంకరం కారు స్టేషనుందర ఆగింది... ఆ పాసింజర్లో అతని స్నేహితుడు రఘునాథ్ వస్తున్నాడు.
టైము చూసుకున్నాడు. ఇంకా రైలు రావడానికి పది నిముషాల సమయం ఉంది. అప్పుడే మొదటి బెల్ కొట్టారు.
హేమంతం కావడంతో ఏడు గంటలైనా మంచు తెరలు తొలగలేదు. నీహారికా బిందు సందోహాలు పచ్చగడ్డి గరికలపై దర్శనం ఇస్తున్నాయి.
కొద్ది కొద్దిగా జనాలు వస్తున్నారు. రఘునాథ్, అతను చిన్నపుడు కౌసల్యపురంలో చదువుకున్నారు. రఘునాథ్ విజయనగరం దగ్గర ఓపల్లెలోని జిల్లాపరిషత్ హైస్కూల్లో టీచరుగా చేస్తున్నాడు.
ఇంతలో రెండవ బెల్లు కొట్టడం, రైలు వస్తున్న చప్పుడు... కారుకి తాళంవేసి ప్లాట్ఫారం మీదకు వచ్చాడు. రైలు ప్లాట్ఫారం మీద ఆగింది.
స్లీపర్ కోచ్ లోంచి రఘునాథ్ దిగాడు. కొద్ది సేపటికి శంకరం రఘునాథ్ ని చేరుకున్నాడు..........