నిధి అంటే నిర్లక్ష్యం
అది 1802. త్యాగరాజుకి 35 సంవత్సరాలు. ప్రౌఢ వయస్కులు, అప్పటికే గాయకుడిగా ఆయన కీర్తి విశేషంగా వ్యాపించింది. సభలలోనూ స్వగృహాల్లోనూ పాడమని ఆహ్వానాలు తరుచుగా వస్తూండేవి. ఆయన అంగీకరించేవారు కూడా.
గురువు గారు శొంఠి వేంకటరమణయ్య గారు తన ప్రధాన శిష్యుడి మీద ఉన్న అభిమానం చేతా, అతడి శక్తిసామర్థ్యాల మీద ఉన్న విశ్వాసం చేతా తంజావూరులోని ఆస్థాన సంగీత విద్వాంసులతో ఆయన కొన్ని చక్కటి కొత్త కీర్తనలు వ్రాశారని ప్రశంసిస్తూ చెప్పారు. వారంతా ఆ కీర్తనలు వినడానికి ఉత్సాహం చూపించారు. గురువుగారి ఇంట్లో కచేరి ఏర్పాటయ్యింది. త్యాగరాజు అతి వినయంగా సభలో ఉన్న పెద్దలందరికీ నమస్కరిస్తూ బిలహరి రాగంలో అందమైన ఒక పాట పాడారు. 16
దొరకునా యిటువంటి సేవ
దొరకునా అల్ప తపంబొనరించిన భూ
సురవరులకైన సురులకైన
తుంబురు నారదులు సుగుణ
కీర్తనంబుల నాలాపము సేయగ
అంబరీష ముఖ్యులు నామము
సేయగ జాజులు పై చల్లగ
బింబాధరులగు సురవర యలి.
వేణులు నాట్యములాడగ
అంబుజ భవ కారులిరు
గడలనన్వయ బిరుదావళిని పొగడగ
అంబర వాస సతులు కర
కంకణంబులు ఘల్లన విసరగ మణి............