• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Thyroid

Thyroid By Samadarshini

₹ 150

భాగం-1
 

అధ్యాయం - 1
 

థైరాయిడ్ గ్రంథి - హార్మోన్ల ల గురించిన ప్రాథమిక విషయాలు
 

150-200 సంవత్సరాల క్రితం మన శరీరంలోని నాడీ వ్యవస్థ (Ner- vous System) ఒక్కటే శరీరంలో జరిగే అన్ని సంక్లిష్ట ప్రక్రియలనూ అదుపుచేస్తుందనుకునే వాళ్ళు. కానీ పరిశోధనలు ముందుకెళ్ళే కొద్దీ శరీరంలో జరిగే అనేక ప్రక్రియలకు నాడీ వ్యవస్థతో సంబంధం లేదని వెల్లడైంది.

అనేక ప్రక్రియలు శరీరంలోని గ్రంధుల ద్వారా జరుగుతున్నాయనీ వినాళ గ్రంధులు-అందునా థైరాయిడ్ గ్రంధి అత్యంత ప్రాముఖ్యత కలిగినదనీ అర్ధమైంది.

థైరాయిడ్ అన్నది ఒక గ్రంధి. దాని పని హార్మోన్లను స్రవించడం (Se- cretion), లేదా ఉత్పత్తి చేసి (Production) బయటికి పంపడం. అందువల్ల థైరాయిడ్ గురించి అర్థం కావాలంటే ముందు మన శరీరంలో హార్మోన్లు ఎలా ఉత్పత్తి అవుతాయో, అవి ఎలా పనిచేస్తాయో కూడ కొంత మేరకైనా తెలుసుకోవడం అవసరం.

హార్మోన్లంటే.....

గ్రీకు భాషలో హార్మోన్ (Harmon) అంటే కదిలించేది లేదా చైతన్యపరచేది. (Stir Up) అని అర్థం. ఇవి ప్రాధమికంగా మనం తీసుకొనే ఆహారంలోని మాంసకృత్తుల (ప్రొటీన్) నుండి తయారయ్యే అమినో ఆమ్లాల ద్వారానే ఏర్పడతాయి. గ్రంధులను పరిశ్రమలుగా భావిస్తే అవి ఉత్పత్తి చేసే పదార్థాలుగా హార్మోన్లను భావించవచ్చు. ఈ పరిశ్రమకు కావలసిన ముడిసరుకులు ప్రొటీన్లు, ఖనిజ లవణాలు.

మన శరీరంలో రెండు రకాల గ్రంధులు ఉంటాయి. మొదటి రకాన్ని ఆంగ్లంలో ఎక్సోక్రైన్ (Exocrine) (తెలుగులో బహి: స్రావ) గ్రంధులు అంటారు. వీటిని రవాణా చేసేందుకు నాళాలుంటాయి గనుక నాళ గ్రంధులు అని కూడ.................

  • Title :Thyroid
  • Author :Samadarshini
  • Publisher :Aarogya Vignana Prachuranalu
  • ISBN :MANIMN6182
  • Binding :Papar Back
  • Published Date :Dec, 2024
  • Number Of Pages :151
  • Language :Telugu
  • Availability :instock