• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Tippu Sultan

Tippu Sultan By Padala Ramarao

₹ 175

శ్రీరంగం
 

రంగనాయకస్వామి కది కేళీరంగం

దక్షిణాత్యుల కది పుణ్యస్థలి

తవళ, తరళ, తరంగిణి కావేరిలో స్నానమాచరించి స్వామిని కొలిచినవారు ఆయన కరుణా కటాక్ష వీక్షణాలచే పాప విముక్తులవుతారట.

ఆ స్వామిని కొలిచి, విప్రనారాయణుడు ముక్తినే సాధించాడట. అట్టి మహిమా సంపన్నుడైన రంగనాయకస్వామికి తగు చిహ్నం నెలకొల్పవలెనని తలంచి మధుర రాజైన తిరుమల నాయకుడు శ్రీరంగంలో ఎత్తయిన గోపుర పరీతమైన గొప్ప దేవళాన్ని నిర్మించాడు.

దాని నిర్మాణానికి ఎంతెంత దూరంనుంచో మహాశిల్పులను రావించాడు. సింహాచల దేవళ శిల్పాలు ఈ ప్రపంచంలోనే మిక్కిలి ప్రసిద్ధమైనవని గమనించి, అచట నుండి కొందరు శిల్పులను రావించాడు. చిత్రవిచిత్రమైన శిల్పాలు చెక్కించి, ఏక శిలాఫలకంతోనే ఆ దేవళానికి స్తంభాలను ఎత్తించాడు. రంగనాయకుని విగ్రహాన్ని నునుపైన నల్లరాతిపై మలిపించాడు. దానిపై వేసిన వ్రేలు కూడా ఇట్టే జారిపోయేంత నునుపుగా వుంటుందా విగ్రహం.

ఆ దేవళ నిర్మాణానికి పదిహేను వర్షములు పట్టినదట. అంతా శిల్పమయం. తొలుతలో రంగనాయక స్వామిమీద భక్తితోనేగాక తెలుగు శిల్పులు మలచిన ఆ అపురూప శిల్పాలను దర్శించుటకే అనేకులు వచ్చేవారట.

అలా అలా శ్రీరంగం పట్నంగా మారి శ్రీరంగపట్నమై కడకు పదునెనిమిదవ శతాబ్దిలో తురుష్క పరిపాలనతో దాని ఖ్యాతి సముద్రాంతరాలకు విస్తరించి ప్రపంచ పరివ్యాప్తమైంది....................

  • Title :Tippu Sultan
  • Author :Padala Ramarao
  • Publisher :Classic Books
  • ISBN :MANIMN5643
  • Binding :Papar Back
  • Published Date :Sep, 2024
  • Number Of Pages :151
  • Language :Telugu
  • Availability :instock