• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Tirupati Balaji Boudha Kshetrame

Tirupati Balaji Boudha Kshetrame By A N Nageswarao

₹ 400

రచయిత ఉపోద్ఘాతం

బౌద్ధమతం పతనం గురించిన పరిణామాల విషయంలో భారతీయ పండితులు అన్ని అంశాలను నిజానికి పరిశీలించలేదు. ఎన్ని ప్రయత్నాలు వారు చేసినా కొన్ని అంశాలకు మాత్రమే పరిమితమయ్యారు. ఇందులో వుండే రకరకాల మలుపుల కారణంగా యిది వారికి సహజమైంది కావచ్చు. దీని విషయం విస్తారమైంది. స్థానిక పరిస్థితులు భిన్నమైన ప్రభావాలను, విభిన్న రూపాలను కలిగివున్నాయి. బౌద్ధమతం మీద చేసే దాడి ప్రక్రియలో కానీ, తర్వాత బ్రాహ్మణవాదంలోకి దాన్ని సమీకరించే ప్రక్రియలోకానీ చాలా పార్శ్వాలున్నాయి. బుద్ధుడిని విష్ణువు అవతారంగా ప్రకటించడం తర్వాత మార్పిడిపై విపరీతమైన ప్రభావాన్ని చూపింది. బుద్ధుడిని విష్ణువుగా మార్చడం అన్నది మరింత నొప్పి లేకుండా చేసే శస్త్రచికిత్స. పేరు కోసం గురువును అంగీకరించడం, తర్వాత సిద్ధాంతాన్ని ఖండించడం బ్రాహ్మణుల వ్యూహం. ఇది ఒక రోజులో సాధించలేదు. ఈ మార్పిడి కోసం తీసుకున్న సమయం కూడా చాలా సుదీర్ఘం. అయితే మార్పిడి మాత్రం అస్పష్టంగా వుంది. అయితే దానికైన మచ్చ, గుర్తులు పడకుండా ఉండదు. అంటరానితనం యొక్క మూలం, కులవ్యవస్థలోని దృఢత్వం, హిందూ సమాజంలో మహిళలను అణచివేయడం, బ్రాహ్మణులు తమ జీవితంలో చేసిన ఎన్నో అవకతవకల్లో కొన్ని భాగాలు. అలాగే అకారణమైన తెలివితక్కువ నిషేధాలు. వివిధ ఆచారాలు, కొత్తగా పెంచి పోషించే మతపరమైన వ్రతాలూ, ప్రజలలో వ్యాప్తి చెందించే రకరకాల కట్టు కథలూ, అనైతిక ధోరణులూ, అనూహ్యమైనవైన యిలాంటివన్నీ ప్రజల మానసిక స్థితిగతుల్లో ఒక రకమైన ఉన్మాదాన్ని కలుగచేస్తున్నాయి. వీటి ముఖ్య లక్ష్యమల్లా, బౌద్ధమతం నుండి ప్రజల మనసులను మళ్లించడం, చాతుర్వర్ణ మూలాలను బలోపేతం చేయడం. మొత్తంగా బ్రాహ్మణ ఆధిపత్యానికి మద్దతునీయడం. ఇలా శతాబ్దాల పర్యంతం.................

  • Title :Tirupati Balaji Boudha Kshetrame
  • Author :A N Nageswarao
  • Publisher :Samanthara publications
  • ISBN :MANIMN6003
  • Binding :Papar Back
  • Published Date :Jan, 2025
  • Number Of Pages :387
  • Language :Telugu
  • Availability :instock