• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Tiruppavai

Tiruppavai By Madabhushi Sridhar

₹ 200

తిరుప్పావై
 

ముందుమాట
 

గోవింద కీర్తనలో గోదమ్మ, అన్నమయ్య

ఓసారి ఉపమా అలంకరం, మరో సందర్భంలో ఉత్ప్రేక్షక అలంకారాలను గోదమ్మ కమలనాథుడు శ్రీకృష్ణుడిని వర్ణించడం ఒక అద్భుతం. గోదమ్మ తిరుప్పావై ముప్పది పాశురాల కావ్యంలో ఈ అలంకారాలు, కమలాలు, కలువలు, ఆ రెండింటితో పోటీ, సూర్యచంద్రులు ఒకేసారి తెరిచి మూస్తూ ఉన్నట్టు భావిస్తారామె. ఈ సందర్భంలో అన్నమయ్య కీర్తనలో, ఆత్రేయ పాటలో, సుమతి శతకంలో పోలికలు కనపడుతూ ఉంటే 'ఏమని పొగుడువునే' అని చెప్పడం సాధ్యమా?

14వ పాశురంలో తిరుప్పావైలో చెప్పిన వివరాలు అద్భుతంగా ఉంటాయి. 'మీ ఇంటి పెరటిలోని తోటలో బావిలో ఎర్రతామరలు విచ్చినవి. నల్లకలువలు ముకుళించినాయి' అనే లోతైన అర్థవంతమైన పాశురం. “వేదవిభూషణ ప్రవచన వారిధి" డాక్టర్ కందాడై రామానుజాచార్య వివరణ మరో గొప్ప పాశురం. "మీ శరీరమే ఒక తోట. చైతన్యప్రసరణ మార్గమగ నాడీ మండలము వెన్నపూసలో ఉంటుంది. అదే దిగుడుబావి. తామర పూవులంటే నాడీ చక్రములు, మూలాధారము, స్వాధిష్ఠానము, మణిపూరము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞాచక్రము, సహస్రారము. ఇక కలువలంటే ఇంద్రియములు. ఆ ఇంద్రియములు ముడిచుకొన్నాయి అని గోదమ్మ వివరిస్తున్నారు".

22వ పాశురంలో "కిజ్ఞిణి వాయ్ చ్చెయిద తామరై ప్పూప్పోలే" అనే వాక్యంలో ఆవు మెడలో మువ్వ వలె శ్రీకృష్ణుడు కన్ను చిన్నగా తెరుస్తున్నాడట. అంటే చిరుగంట................................

  • Title :Tiruppavai
  • Author :Madabhushi Sridhar
  • Publisher :Emasco Books pvt.L.td.
  • ISBN :MANIMN6210
  • Binding :Papar Back
  • Published Date :March, 2025
  • Number Of Pages :232
  • Language :Telugu
  • Availability :instock