గుప్తుల అనంతరయుగంలో, కాలక్రమంలో బాగా వేళ్లూనుకొన్న ప్రాంతీయ అస్తిత్వాలు ఆరంభమయ్యాయి. రాజకీయ, సాంస్కృతిక సమైక్యతను సృష్టించే కేంద్రీకృత అధికార వ్యవస్థమీద ఆధారపడ్డ సామ్రాజ్యభావన, మరెంతోకాలం సానుకూలంగా కనిపించలేదు. ఈ కాలంలో అనేక వ్యవస్థలు ఏర్పాటు కావడంతో పాటు ఈనాడు భారతదేశం ఎదుర్కొంటున్న సమస్యలను కూడా మనం గమనిస్తాం. ప్రాంతీయ భాష, కళ, వాస్తుకళ, శిల్పం, ఆర్థిక వ్యవస్థ, సంస్కృతి వంటి అంశాల మీద ఆధారపడ్డ ప్రాంతీయవాద భావనలు వేళ్లూనుకోవడం ప్రారంభమైంది. ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర అనే బహుళ ప్రాంతాల మీద ఆధారపడ్డ, భిన్న ప్రాంతాలతో కూడిన భారతదేశాన్ని అంగీకరించడానికి ఇది దారితీసింది. ప్రజల దృక్పథాన్ని ప్రభావితం చేసిన భావనగా స్థానికవాదం వృద్ధి చెందడానికి ఈ కాలం కొంతవరకూ మార్గం ఏర్పరచింది.
గుప్తుల అనంతర యుగంలో ఉత్తర భారతదేశం, ప్రాంతీయ రాజ్యాలుగా విడిపోయింది. ఈ ప్రాంతీయ రాజ్యాలను మలిగుప్తులు, మౌఖరులు, పుష్యభూతులు, ప్రతీహారులు మొ॥వారు పాలించారు. ఈ రాజవంశాలలో పుష్యభూతి రాజవంశం చరిత్రలో ప్రసిద్ధిగాంచిన హర్షవర్ధనుడిని అందించింది. హర్షవర్ధనుడు, ప్రభాకర వర్ధనుడి చిన్నకుమారుడు.
హర్షవర్ధనుడు, కనౌజ్ను రాజధానిగా చేసుకొన్నాడు. తరువాత ఇతను థానేశ్వర్ పాలకుడయ్యాడు. ఇతని ఆస్థానకవి బాణభట్టు రచించిన 'హర్షచరిత' అనే జీవిత చరిత్ర ఆధారంగా హర్షుడి జీవితాన్నీ, ఘనకార్యాలను పునర్నిర్మించవచ్చు. బాణభట్టు, 'కాదంబరి' అనే కావ్యాన్ని కూడా రచించాడు. హర్షుడు స్వయంగా కవి. ఇతను 'రత్నావళి', 'ప్రియదర్శిక' 'నాగానందం' రచించాడు.
చైనా యాత్రికుడయిన హూయన్ త్సాంగ్, హర్షుడి ఆస్థానాన్ని సందర్శించడంతో పాటు దాదాపు 15 సంవత్సరాల పాటు దేశంలో పర్యటించాడు. హూయనా త్సాంగ్, బౌద్ధమతాన్ని ఆదరించిన హర్షుడితో స్నేహ సంబంధాలు నెలకొల్పుకున్నాడు. ఈ కాలంలో 'నలంద' ప్రసిద్ధ కేంద్రంగా విరాజిల్లింది. ఇక్కడే బౌద్ధ విశ్వవిద్యాలయం.................