• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Tolstoy Na Sanjayashi

Tolstoy Na Sanjayashi By Dr B Satyavati Devi

₹ 75

అనువాదకుల ముందుమాట

అందుకే టాల్స్టాయ్ మాకిష్టం!

"వ్యాపారం చేసుకునే ఒక కంపెనీ 20 కోట్ల జనాభా గల దేశాన్ని తన బానిసగా చేసుకుంది. మూఢనమ్మకాలు లేని ఒక వ్యక్తికి ఈ మాటలు చెబితే అర్థం చేసుకోలేడు. 30 వేలమంది (బలాడ్యులు కాని) బలహీనమైన, సామాన్యమైన మనుషులు, శక్తివంతులైన, తెలివిగల, సమర్థులైన, స్వేచ్ఛా పిపాసులైన 20 కోట్ల మందిని లొంగదీసుకోగలిగారంటే, దానర్థం ఏమిటి? పైన చెప్పిన వాటిని బట్టి, ఆంగ్లేయులు భారతీయుల్ని బానిసలు చేసుకోలేదు, భారతీయులు తమకు తామే బ్రిటిష్ వారికి బానిసలైపోయారని అర్ధం కావటం లేదా?" లియో టాల్స్టాయ్ ఇండియా గురించి అన్న మాటలు.

19వ శతాబ్దంలోనే మన జాతి మేల్కొనడానికి పై మాటలు ఎంతో దోహదం చేసి ఉంటాయి. శాంతి, అహింస, సాంఘిక న్యాయం, అనే మూడు సూత్రాలు ఆయుధాలుగా లోకానికి అందించాడు టాల్స్టాయ్. మన దేశ జాతిపితగానూ, ప్రపంచ శాంతి దూతగాను భావించబడిన మన గాంధీ, “టాల్స్టాయ్ నా గురువు" అని చెప్పుకున్నాడు.

అందుకే టాల్స్టాయ్ని మేము ఇష్టపడతాం!

(కొందరికి అహింసాయుధం గురించి అభిప్రాయాలు వేరుగా ఉండవచ్చు).

ఆత్మకథలు చాలామంది రాసుకుంటారు. తమ అనుభవాలూ, జ్ఞాపకాలూ, తమ అభివృద్ధికి దోహదపడిన వ్యక్తుల గురించీ, స్వోత్కర్షలు, ఇలా ఎన్నో రాసుకుంటారు. కానీ జీవితపథంలో తాము చేసిన తప్పులూ, ద్రోహాలూ, ఆత్మవంచనలూ, మోసాలూ, తమ బలహీనతలూ రాసుకుంటానికి, కనీసం................

  • Title :Tolstoy Na Sanjayashi
  • Author :Dr B Satyavati Devi
  • Publisher :Sahithi prachuranalu
  • ISBN :MANIMN5396
  • Binding :Paerback
  • Published Date :Feb, 2024
  • Number Of Pages :96
  • Language :Telugu
  • Availability :instock