రెండో హరిహర రాయలు రాజ్యపాలన చేస్తున్నప్పుడు, ఆయన మంత్రి ఇరుగప్ప దండనాయకుడు తిరుప్పారతి కుండ్రం - వర్తమాన దేవాలయ సంగీత మండపంలో క్రీ.శ. 1385లో అందమైన తెలవర చిత్రాలు వేయించాడు. వర్తమాన మహావీరునితో పాటు జైన తీరంకరుల తెల వర్ణ చిత్రాలు ఆ గుడిలో ఎంతో అందంగా రూపొందాయి. విజయనగర సామ్రాజ్యంలో చిత్ర లేఖనం బాగా అభివృద్ధి చెందింది. వర్ణ చిత్రాల కళ దేవాలయాల్లో వివిధ గాధా కథలను వివరించడానికి విరివిగా వాడారు. రాజులు - కుటుంబాలు, రాజ ప్రతినిధులు వంటి వారి బొమ్మలు సైతం సందర్భానుసారంగా గుళ్ళలో చోటు చేసుకొన్నాయి. కానీ రాజభవనాల్లో మాత్రం అరుదుగానే కనిపిస్తాయి. విజయనగరం (హంపి)లోని అంత: పురంలో శ్రీక్రిష్ణదేవరాయలు నివసించిన రెండంతస్తుల భవనంలో గోడలపై అద్భుత చిత్రాలున్నాయి. శ్రీక్రిష్ణదేవరాయలు, తండ్రి నరసనాయకుడు, వారి పూర్వీకుల నిలువెత్తు తైలవర్ణ చిత్రాలు గొప్పగా వున్నాయని పోర్చుగీసు పర్యాటకుడు డొమింగో పేస్ రాశాడు. డొమింగో పేస్ గుర్రాల వ్యాపారి. రాజభవ నాల గోడలు అందమైన వర్ణ చిత్రాలతో అలంకరిం చబడ్డాయని అంత:పుర వర్ణనలో వివరించాడు. చిత్రలేఖనం రాజధాని నగరానికే పరిమితం కాకుండా రాజ్యమంతటా విస్తరించింది. అయితే తైల వర్ణ చిత్రాలు కొన్ని కోవెలల్లోనే కనిపిస్తాయి.
లేపాక్షిలో వెలసిన 'వర్ణచిత్రాలు విజయనగర రాజ్య చిత్ర లేఖనా శైలికి సమున్నత నిదర్శ. ఎందుకంటే ఆలయాల్లో సంగీత - రంగ మండపాలో మాత్రమే తైల వర్ణ చిత్రాలుంటాయి. కానీ లేపాక్షి వీరభద్రాలయ సముదాయమంతా సప్తవర్ణ చిత్ర శోభితమే. ఆలయంత విరూపణ ఆ రోజుల్లో అజంతాను సందర్శించా.............