తొవ్వని బలపరిచిన వారికి...
తొవ్వ ముచ్చట్లు 325 వారాలకు పైగా ఆంధ్రభూమి దినపత్రిక ఆదివారం ఎడిట్ పేజీలో నిరాఘాటంగా వెలువడి పాఠకుల నుండి అపూర్వమైన స్పందనకు నోచుకుంది.
సంపూర్ణమైన స్వేచ్ఛతో ఈ శీర్షికని రాయడానికి అవకాశం ఇచ్చిన ఎంవి ఆర్ శాస్త్రి గారికీ, పత్రిక సంపాదక వర్గానికీ నిరంతరం ఆదరించిన పాఠకులకీ ముందుగా ధన్యవాదాలు.
తొవ్వ ముచ్చట్లు నా సొంతం కాదు. నేను నడిచిన కాలి బాటల పొంటి కలిసిన ఎందరో ప్రజల జీవితానుభవాల నుంచి నేను పిండుకున్నవి. వాటిని నా మాటల్లో పొందుపరచి మీ ముందుంచాను. అంతే. వారందరికీ ఇవి అంకితం. ఈ తొవ్వలో నాతొ భుజం కలిపి నడిచిన వారందరికీ మప్పిదాలు.
తొవ్వ ముచ్చట్లు పుస్తకంగా ఏడు సంపుటాలు రావడంలో ఎందఱో మిత్రుల సహకారం వుంది. కొందరు ఆర్థికంగా సహకరించారు. మరికొందరు ప్రచురణకు తోడ్పడ్డారు. చాలా మంది మాట సాయం చేసి ప్రోత్సహించారు. తమంత తాము ముందుకు వచ్చి ఆవిష్కరణ సభలు ఏర్పాటు చేసి అభినందించారు. వారందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు.........