ఆలోచింపచేసే ‘త్రికాల' నవల
సృజనాత్మక రచన ఒక కళ. ఆ కళ అందరికీ అందదు. జన్మతః లభించిన కళను సదుపయోగం చేసుకోవడం సమర్థత. ఆ సమర్థతను సద్వినియోగం చేసుకున్న రచయిత్రి డా. కె.బి సంధ్య. వృత్తి డాక్టరు ఐతే, ఆకాంక్ష, సున్నితత్వం, ఉద్విగ్నత కలగలసిన ప్రవృత్తి డా. సంధ్యది. సమాజం పట్ల వ్యక్తిగా సంధ్యకున్న ఆత్మీయత, బాధ్యత, సమాజ శ్రేయస్సు కోసం ఆరాటం మనకు ఆమె రచించిన నవల "త్రికాల" పొడవునా కనబడుతుంది. సాంకేతికత విస్తృతంగా విస్తరించిన ఈ సందర్భంలో 'త్రికాల' కోసం రచయిత్రి వెతుకులాట అందుకోసం చేసే తీవ్రమైన ప్రయత్నం పాత్రల ముఖంగా ప్రదర్శిస్తుంది. నవల పొడవునా ఒక ఆర్తి పాఠకులను విచలితులను చేస్తుంది. అశ్రిత కులాల వ్యధను తెలిపే నవలను అందించే క్రమంలో రచయిత్రి ఎదురుకొన్న మానసిక సంక్లిష్టత, ఉద్వేగం, ఆతురత ప్రతి పాఠకుడినీ ఉవ్వెత్తున ఎగసిపడే అలలా పడి లేచేలా చేస్తుంది.
ఒక ఆరేళ్ళ పిల్ల భయానకమైన జీవిత నేపథ్యం వెనుక ఉన్న నిజం వెతకడంతో ప్రారంభమయ్యే నవల వాస్తవంలో పయనిస్తూ, గతంలోకి వెళుతూ, పాఠకులను విస్మయపరుస్తూ సాగుతుంది. ఒక నిజం తెలుసుకోవడం కోసం తాపత్రయపడుతూ, ఒక డాక్టర్ కుటుంబం ప్రయాణం ప్రారంభిస్తుంది. ఈ ప్రయాణం పాఠకులకు ఎన్నో అనుభూతులను మిగులుస్తుంది. మూడు తరాల జీవిత ఆకాంక్షలను తెలుపుతుంది ఈ నవల. తెలంగాణలో సమాజ దురహంకారానికి బలైన ఒక దళిత కుటుంబంలోని ఒక....................