Logili Books

Short Stories

Triveni Vasantagaanam

By Sharvani

₹200
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Triveni Vasantagaanam
Author
Publisher
Analpa book company
ISBN
MANIMN3518
Binding
Paerback
Published Date
2022
Number Of Pages
180
Language
Telugu
Availability
In Stock
About this book

వాసు కంగారు పడిపోతున్నాడు. క్షణానికోసారి వాచ్ వంక చూసు కుంటున్నాడు. మళ్ళీ నిస్సహాయుడై తలుపువేపు చూస్తున్నాడు. హృదయంలో నుండి నోటిదాకా వచ్చి బైటపడాలని ప్రయత్నిస్తున్న మాటల ప్రవాహాన్ని అతికష్టంతో ఆముదం మింగినట్టు మింగేస్తున్నాడు. అప్పుడప్పుడూ జేబు రుమాలుతో మొహంమీది చెమటను తుడుచుకుంటున్నాడు.

లోపలినుంచి వినిపిస్తున్న చప్పుళ్ళను ఆత్రంగా వింటున్నాడు. అతను నిరీక్షిస్తున్న చప్పుడు- దానికోసం అతని చెవులు నిక్కబొడుచుకున్నాయి.

ఇప్పుడే వినిపిస్తుందేమో! మరోక్షణం ఆగాలేమో! | ఊహూఁ. వాసు బిక్కమొహంతో వాచీ వేపు చూసుకున్నాడు. ఎందుకింత ఆలస్యం? అతనికేమీ అర్థం కాలేదు.

తన మనసులోని ఆరాటాన్ని, పసిపిల్లలు చేదుమందును కక్కేసినట్లు | బెటకు కక్కెయ్యాలనిపించిందతనికి. విప్లవ ప్రవాహం గొంతులో అడుపడి ఓ విధమయిన అధైర్యాన్ని కలిగించింది. ఊపిరి సలపనట్టయి కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

ఆఖరికి తన ఉద్వేగాన్ని తట్టుకోలేక మెల్లిగా, "సరళా..!" అని పిలిచాడు.

లోపలి నుండి జవాబేమీ రాలేదు. వాసు అడుగులో అడుగు వేసు కొంటూ పిలిలా లోపలికి ప్రవేశించాడు. వాసు హృదయేశ్వరి సరళ కతిపీటమీద కూర్చునుంది. ఆమె వదనారవిందం వాడిపోయింది. ఆమె కుడిచేతి చూపుడువేలు నుండి రక్తం సన్ననిదారంలా బయటికి వస్తోంది............

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?