₹ 99
గొల్లపూడి అత్యంత ప్రజాదరణ పొందిన నటుడు. రచయిత. విశ్లేషకుడు. ఉపన్యాసుడు. వక్త. వ్యాఖ్యాత. పత్రికా రచయిత. ఇవన్నీ ప్రతిభావంతుడైన ఓ వ్యక్తిలోని విభిన్న కోణాలు. మాటైనా, నటనైనా, విమర్శ అయినా, విశ్లేషణ అయినా, ఉపన్యాసమైనా, ఉపోద్ఘాతమైనా... ప్రక్రియ ఏదైనా కానీ, ప్రతిదాంట్లో ఓ విరుపు. అదే గొల్లపూడి మార్కు మెరుపు. తెలుగు సాహితీలోకంలో గొల్లపూడి పరిచయం అవసరం లేని పేరు. మనింటి పెద్దాయన పిల్లల్ని దగ్గరగా కూర్చోబెట్టుకుని ఒద్దికగా సుద్దులు చెబుతున్నట్లు సాగిపోతాయి గొల్లపూడి రచనలు. అత్యంత సూక్ష్మస్థాయిలో ప్రతి అంశాన్ని పరిశీలించటం, తనలో ప్రశ్నించుకోవటం , తర్కించుకోవటం, ఆ తర్వాత రచించటం.... గొల్లపూడి వరుస ఇది. చెప్పదలచుకున్న భావాన్ని సూటిగా, స్పష్టంగా, ఏమాత్రం తడబాటులేకుండా తేలికైనా పదాలతో గంభీరమైన భావాన్ని చెప్పటం గొల్లపూడికి మాత్రమే చెల్లింది .
- Title :Pidikedu Aakasam
- Author :Dr Gollapudi Maruthirao
- Publisher :S.R.Publications
- ISBN :MANIMN0840
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :224
- Language :Telugu
- Availability :outofstock