• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Mana Konaseema Kadhalu

Mana Konaseema Kadhalu By Dr Vedula Sriramasharma

₹ 200

కలుపు మొక్కలు

- శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి

"చిత్తం చిత్తం. ఒక్క కలంపోటుతో తమరొక బ్రాహ్మణ కుటుంబానికి యావజ్జీవమూ అన్నం పెట్టించగలరు.”

"అన్నం పెట్టినా సున్నం పెట్టినా జిల్లా బోర్డు ప్రెసిడెంటు గాని, నావల్ల యేమవు

"పేరు మట్టుకి వారిదే. అంటే, మనవి చేసుకుంటాను. ఒక సత్రం వుందంటే దాన్న ప్రతిష్టించిన దాత వేరూ, కనిపెట్టుకుని వుండి అక్కడ సద్దుబాట్లు చేసే గుమాస్తా వేరూనూ. అయితే, ఆ దాత ఆజ్ఞని శిరసావహించడమే ఆ గుమాస్తా విధి కాదా మహా

"నేను దాతను కానే? ప్రెసిడెంటు అంటే గుమాస్తా కూడా కాడే?” “తమరలా సెలవిప్పిస్తే నేనేం మనవి చేసుకోగలనూ? సబ్ కలెక్టరు దొరవారి శిఫారసు తోసేసి యే ప్రెసిడెంటు బతగ్గలడూ?”

"నిజమే కాని అది పూర్వకాలం మాట. ఇప్పుడలాంటి పద్ధతు లేవీ సాగవు. . వెనకటి రోజుల్లో యే మున్సద్దీ ప్లీడరో జిల్లా బోర్డు ప్రెసిడెంటు అయేవాడు. అధికార్ల దగ్గిర యెంత భయభక్తులతో మసులుకోవాలో వాళ్లకి బాగా తెలిసివుండేది. ఇప్పటి వాళ్లు చాలామంది మాట సుమా - స్కూల్ ఫైనల్ కూడా కానక్కర్లేదు. ఓటు - ఇప్పు డంతా నోటుతో వుంది మహిమ. ఆపైని గుజరాతీ కోమట్లకి మంగళప్రదమైన పచ్చ పెట్టి. ఇక చెప్పడానికేం వుందీ? పెద్ద సంతకమా చిన్న సంతకమా అని డభేదారు నడిగికాని.”

“తమరే వుపక్రమించారు కనక విన్నవించుకుంటాను. మన ప్రెసిడెంటుగారు - చిత్తగించారు? తక్కిన అవగుణాలు అలా వుండగానున్నూ, రాత్రీపగలూ కూడా కేవలమూ వేశ్యావాటికలో.”

"సాటి బ్రాహ్మణ్ణి పట్టుకుని అలా అంటే వేమిటయ్యా?"

"సాటివాడు కనకనే మాకీ తిప్పలు. బ్రాహ్మడు కనకనే మాఘస్నానాలూ దొమ్మరి గుడిసెలూనూ. అలాకాక యే రెడ్డిగారో, యే నాయుడుగారో, యే చౌదరి గారో అయితే.” "వా! బ్రాహ్మణ యుక్తి అంతా కురిపించేస్తున్నావే!”....................

  • Title :Mana Konaseema Kadhalu
  • Author :Dr Vedula Sriramasharma
  • Publisher :Deepthi Prachuranalu
  • ISBN :MANIMN5146
  • Binding :Papar back
  • Published Date :Feb, 2024
  • Number Of Pages :192
  • Language :Telugu
  • Availability :instock