నేను పొద్దున్నే లేచేసరికి సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. ఎక్కడున్నానా అని ఆలోచిస్తూ, చుట్టూ పరీక్షించి చూశాను. ఆలివ్ రిడ్లీ జాతికి చెందిన తాబేలు పిల్లనని అప్పుడు నాకు గుర్తొచ్చింది. ఒక సువిశాల నీలి ప్రపంచం మధ్యలో ఇప్పుడు నేనున్నాను. దీన్ని సముద్రం అంటారని ఎవరో అంటే విన్నాను. నా చుట్టూ అన్ని వైపులా వ్యాపించి నీలం, పచ్చరంగుల్లో నీరు ఉంది. సూర్యుడు మబ్బులతో దోబూచులాడుతున్నాడు. నా డిప్పలోకి కాళ్ళని లాగేసుకొని కొంతసేపు నీళ్ళలో తేలుతూ ప్రవాహంతోపాటు వెళ్ళాను.
నేను ఎక్కడున్నానో నాకు తెలియదు, అయినా, కడుపు నిండుగా ఉంది. పైన సూర్యుడు ప్రకాశిస్తున్నంత వరకూ ఎక్కడున్నా పరవాలేదు. సూర్యరశ్మి నన్ను వెచ్చగా చేసి, నాలో కొత్త శక్తిని నింపింది.
When I woke up in the morning, the sun was shining again. I looked around me, wondering where I was. And then I remembered. I was a baby sea turtle - an olive ridley - in the middle of a big blue world, which I had heard someone call the ocean. There was blue and green water in every direction, and the sunlight was playing games with the clouds. I tucked my flippers beneath my body and floated for a while, letting the current carry me. I did not know where I was. But that does not matter when the sun is shining, and your stomach is full.
The sun warmed me, and filled me with new energy.................