₹ 260
ప్రకటనలు - సంస్కృతి
"Advertising and culture are interrelated. Whatever is shown in advertisement is easily accepted by members of society and it becomes a trend'(1) - Monika, Research scholar (2015)
ప్రకటనలు, సంస్కృతి రెండూ వేర్వేరు కాదు. ఇవి ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నాయి. 'ప్రకటనల్లో చూపించిందే కొన్నాళ్లకు ఒక ట్రెండుగా మారుతుంది'. ట్రెండ్ అంటే ఇక్కడ 'ఒక కొత్త సంస్కృతి' అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
ప్రకటనలు కొన్నిసార్లు ప్రజా సంస్కృతిని ప్రతిబింబిస్తే మరికొన్ని సార్లు ప్రజా సంస్కృతిని ప్రభావితం చేస్తాయి. ఈ రెండింటిలో ఏదో ఒకటి చేయకపోతే వాటికి మనుగడ ఉండదు.
అందుకే “చీరియోస్ తినేవాళ్లకు పాప్ కార్న్ అమ్మడమే ప్రకటన” అంటారు లియోబర్నెట్ (2) అనే రచయిత. అంటే అప్పటికే ఒక ఆహార పదార్థానికి అలవాటు పడ్డ మనిషితో ఆ అలవాటును మాన్పించి మరో కొత్త అలవాటు చేయడం ప్రకటన ఉద్దేశ్యం. అంటే మనుషుల అభిరుచుల్లో, అలవాట్లలో, పద్ధతుల్లో మార్పు తీసుకు రావడమే ప్రకటనల పని. మరి ఈ అభిరుచులు, పద్ధతులు, అలవాట్లు అంటే ఏంటి.. అవి మనిషి సంస్కృతిలో భాగమే కదా.
“ఒక సమాజం యొక్క సంపూర్ణ జీవన విధానమే సంస్కృతి. ఆ సమాజం పాటించే ఆచారాలు, పద్ధతులు, అభివాదాలు, వస్త్రధారణ, భాష, మతం, ఆటలు, విశ్వాసాలు, కళలు... అన్నీ కలిపి సంస్కృతి అవుతాయి ” అంటాడు విలియమ్స్ రేమండ్ అనే శాస్త్రవేత్త తన కల్చర్ (1995) అనే పుస్తకంలో.
అంటే సంస్కృతి కానిదేదీ లేదు. మనిషితో సంబంధం ఉన్న ప్రతీది సంస్కృతే. అందుకే ప్రజల సంస్కృతిని ప్రతిఫలించని ప్రకటనంటూ ఏదీ ఉండదు.
- Title :TV Prakatanalu Bhasha, Samskruthula Parisilana
- Author :Dr Vempalli Shareef
- Publisher :Classic Books
- ISBN :MANIMN2490
- Binding :Paerback
- Published Date :2021
- Number Of Pages :272
- Language :Telugu
- Availability :instock