ఉభయభారతి
''చూశావా?"
"ఏమిటి చూశావా?"
"శాస్త్రచర్చలో నన్నోడించడానికి శంకరు డొస్తున్నాట్ట!”
"వచ్చాక చూద్దాం లెండి".
"అంటే రాడంటావా?"
"నేనన్నది ఆ అర్థంలో కాదు”.
“మరే అర్థంలో?”
అన్నాను”.
"శంకరుడింకా రాలేదుకదా! రానివాణ్ణి ఎలా చూస్తాం? అందుకే వచ్చాక చూద్దాం.
"సంతోషించాంలే!”
"సంతోషించక ఏం చేస్తారట?!"
"ఓసి ఉభయభారతీ బిరుదాంకిత సరస్వతీ మహాదేవీ! నువు మీ నాయనగారి దగ్గర తర్కం చదివిన మాట నిజమే కాని, నువ్విప్పుడు చేస్తున్నది కుతర్కమేమో కాస్త చూసుకో!"
"ఓయి ధర్మవిద్యా చతురానన బిరుదాంకిత మండనమిశ్ర మహాశయా! ఏం చూడమంటారు? శంకరు డొస్తున్నా డనేది వార్త. వార్తని వింటారుగాని చూడరు. ఏదైనా విషయం చెప్పబోయే ముందు 'విన్నావా' అని అనాలిగాని, 'చూశావా' అని అంటారా?”
"ఇల్లా విపరీతంగా వాదిస్తే, అసలు మాట్లాడటమే అసాధ్యమౌతుంది."
"కష్టసాధ్యమౌతుందేమో గాని, అసాధ్యం మాత్రం కాదు. ఆచితూచి మాట్లాడటమంటే అదేమరి!”.....................