• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Uma Mandasmita Chandrika

Uma Mandasmita Chandrika By Rangavajjala Muralidhara Rao

₹ 250

"అమృతవరిణి - అమ్మస్మితము"

“సర్వ చైతన్యరూపామ్ తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిః యా నః ప్రచోదయాత్”

(దేవీభాగవతము)

అమ్మ జగన్మాత ఆదిపరాశక్తి. అన్ని విద్యలకూ మూలమైనది. అమ్మ చైతన్యరూప. విశ్వంలో ప్రతి అణువులో నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ప్రసరణ, ప్రవాహ లక్షణమే చైతన్యము. ఆ చైతన్యాన్ని "మా బుద్ధిని ప్రచోదనము చేయి. మమ్ములను సన్మార్గములో పయనింపజేయి”. అని ప్రార్థిస్తున్నాను.

అమ్మ జగన్మాత "దేహే దేహే సేయం కుండలినీ నామ జగదంబా" అని మానవులందరిలో కుండలినీ రూపంలో ఉంది. 'సారమీశ్వరి ! తిలేష్వివ తైలమ్...” (ఉమాసహస్రము 15-6) అని నువ్వుగింజ అంతటా నువ్వులనూనెలా అంతటా వ్యాపించి ఉంది. " "అంతర్బహిశ్చ తత్సర్వమ్ వ్యాప్య నారాయణః స్థితః, తిర్యగూర్ధ్వమథశ్శాయీ రశ్మయః తస్య సంతతా.....” అని, అడ్డంగా, నిలువుగా, క్రింద, పైనా, బాహ్యంలో, లోపలా అంతటా ప్రవహించే చైతన్యమది.

“అగ్నిస్త్వమ్ సోమస్త్వమ్ త్వమథోజ్వలసి ద్రవస్యూర్ధ్వమ్
అమృతమనయోః ఫలమ్ త్వం తస్య చ భోక్తీ చిదంబ ! త్వమ్ ”

(ఉమాసహస్రము 14-11) అని అగ్ని, చంద్రుడు, జ్వలనక్రియ, ద్రవణక్రియ, అమృతము, అమృతభోక్తి, చైతన్యశక్తియు అమ్మయే. అదే సర్వానికి ఆదియైన చైతన్యం. చైతన్యమే అమ్మ స్వరూపం. ఆ చైతన్యమే ఇంద్రియాలవైపు బుద్ధిని ప్రేరేపిస్తుంది. అదే చైతన్యం బుద్ధినికూడా ఆత్మ వైపు సైతం ప్రేరేపిస్తుంది . ఆత్మ వైపు పయనించాలంటే అమ్మ కృప కావాలి. ఆ విశ్వ చైతన్యం మా బుద్ధులను ఇంద్రియాలవైపు కాకుండా,

  • Title :Uma Mandasmita Chandrika
  • Author :Rangavajjala Muralidhara Rao
  • Publisher :Bharadwaja Publishares
  • ISBN :MANIMN3853
  • Binding :Papar back
  • Published Date :2022
  • Number Of Pages :208
  • Language :Telugu
  • Availability :instock